SBI: ఎస్బీఐ ఖతాదారులకు బిగ్ అలెర్ట్.. ఈ టైమ్‌లో యూపీఐ సహా అన్నీ బంద్..

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా..? అర్ధరాత్రి వేళల్లో ఆన్‌లైన్ పేమెంట్లు లేదా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారా? అయితే ఇది మీకోసమే.. అక్టోబర్ 24 శనివారం తెల్లవారుజామున ఎస్బీఐ కీలక సేవలను నిలిపివేస్తుంది. గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐతో పాటు యోనో, నెట్ బ్యాంకింగ్ అన్నీ బంద్ కానున్నాయి. అసలు ఏ సమయంలో ఈ సేవలు ఆగనున్నాయి? మరి ఆ టైమ్‌లో డబ్బులు ఎలా పంపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

SBI: ఎస్బీఐ ఖతాదారులకు బిగ్ అలెర్ట్.. ఈ టైమ్‌లో యూపీఐ సహా అన్నీ బంద్..
Sbi Digital Services Down

Updated on: Oct 23, 2026 | 5:11 PM

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలక అప్‌డేట్ అందించింది. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల కారణంగా అక్టోబర్ 24 శనివారం అర్ధరాత్రి బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 01:45 గంటల నుండి 02:30 గంటల వరకు మొత్తం 45 నిమిషాల పాటు కీలక డిజిటల్ లావాదేవీలు పనిచేయవు. ఈ సమయంలో యుపీఐ, ఐఎంపీఎస్, యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంకు స్పష్టం చేసింది.

ఖాతాదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు

ఈ 45 నిమిషాల అంతరాయ సమయంలో కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా ఎస్బీఐ ప్రత్యామ్నాయ సూచనలు చేసింది. చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ లైట్ సేవలను, నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం ఏటీఎం సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. సిస్టమ్స్ అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఈ అంతరాయానికి ఖాతాదారులకు కలిగే అసౌకర్యానికి ఎస్బీఐ విచారం వ్యక్తం చేసింది. లేట్ నైట్ లేదా తెల్లవారుజామున అత్యవసర నగదు బదిలీలు ప్లాన్ చేసుకునే వినియోగదారులు.. ఈ నిర్వహణ సమయానికి ముందే లేదా తర్వాత లావాదేవీలు పూర్తి చేసుకోవాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us