
SBI: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తక్కువ వ్యవధిలో ఎక్కువ వడ్డీని అందించే లక్ష్యంతో ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti) పేరిట ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాన్ని నిర్వహిస్తోంది. 444 రోజుల వ్యవధి కలిగిన ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం ద్వారా సాధారణ పౌరులతో పాటు సీనియర్ సిటిజన్లు ఆకర్షణీయమైన వడ్డీ రాబడిని పొందవచ్చు. మీరు గనుక ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి ఎంత చేతికి వస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
SBI సాధారణ ఎఫ్‌డీ రేట్ల కంటే ఈ 444 రోజుల స్కీమ్‌పై అధిక వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరులకు ఏడాదికి 6.45% వడ్డీ రేటు. అలాగే సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి 6.95% వడ్డీ రేటు (అదనంగా 0.50% లభిస్తుంది). సూపర్ సీనియర్ సిటిజన్లకు 80 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి 7.05% వడ్డీ రేటు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: DMartలో అన్ని ఉన్నా ఇవి మాత్రం ఎందుకు ఉండవు.. వెనుకున్న అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే!
ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు జమ చేసినప్పుడు 444 రోజుల తర్వాత ఎంత రాబడి వస్తుందో చూద్దాం.
ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా లేదా SBI YONO యాప్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు. తక్కువ వ్యవధిలో (సుమారు 14.5 నెలలు) సేఫ్‌గా గ్యారెంటీ రాబడి పొందాలనుకునే వారికి ఈ ‘SBI అమృత్ వృష్టి’ మంచి ఎంపికగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: Cheapest Bikes: దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? దేశంలో అత్యంత చౌకైన 5 బైక్‌లు ఇవే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి