
సంక్రాంతి పండగకు ఎక్కడెక్కడి వారంతా సొంతూళ్లకు చేరుకుంటారు. అన్నీ పండుగల సంగతి ఎలా ఉన్నా.. సంక్రాంతిని మాత్రం కుటుంబమంతా కలిసి జరుపుకునేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సంక్రాంతిని ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. కోడి పందెలా హడావిడి, పిండి వంటలు, ముగ్గులు, భోగి మంటలు అబ్బో ప్రతిదీ ఒక అద్భుతమే. అందుకే ఈ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. అయితే సంక్రాంతి సందర్భంగా ఇంటికి వెళ్లేందుకు నగరాల్లో ఉండే వారు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పండగ సమయంలో ఉండే రద్దీ దృష్ట్యా ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకుంటారు.
అయితే ఎంత ముందుగా బుక్ చేసుకుందాం అనుకున్నా.. సంక్రాంతి సీజన్‌లో ట్రైన్ టిక్కెట్ దొరకడం అంటే అంత ఈజీ కాదు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే 6 స్పెషల్ ట్రైన్లను నడిపేందుకు సిద్ధమైంది. వాటి వివరాలను కూడా వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
రైలు నెంబంర్ 07450/07451 కాకినాడ టౌన్ – వికారాబాద్ – కాకినాడ టౌన్ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి రెండు స్టేషన్లలో ఆగుతుంది. రైలు నెంబర్ 07452/07453 నాందేడ్ – కాకినాడ టౌన్ – నాందేడ్ ప్రత్యేక రైళ్లు ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డిలలో ఆగుతుంది. మేడ్చల్, బొల్లారం, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. రైలు నెంబర్ 07454/07455 మచిలీపట్నం – వికారాబాద్ – మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేటలో ఆగుతాయి. చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. సర్వీసెస్‌లో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి