
February New Rules: జనవరి నెల ముగియబోతోంది. ఫిబ్రవరి సాధారణ బడ్జెట్‌తో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు చరోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపనున్నాయి. ప్రతి నెల 1న ఎల్‌పీజీ ధరల్లో మార్పులు ఉంటాయి. ఫిబ్రవరి 1, 2026 నుండి అమలులోకి వచ్చే అటువంటి ఐదు ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం.
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి రోజున LPG సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఫిబ్రవరి 1, 2026న కొత్త LPG ధరలు కూడా విడుదల అవుతాయి. ఇందులో ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈసారి 14 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు సవరించవచ్చని ప్రజలు ఆశిస్తున్నారు. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరలు చాలా కాలంగా మారుతున్నాయని, జనవరి 1న రాజధాని ఢిల్లీలో వాణిజ్య LPG సిలిండర్ ధర (ఢిల్లీలో LPG ధర) రూ.14.50 తగ్గింపుతో రూ.1804గా మారింది.
LPG సిలిండర్ ధరలలో మార్పుతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1న సవరించిన ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలను కూడా విడుదల చేస్తాయి. ATF ధరలలో లేదా విమాన ఇంధనంలో ఏదైనా మార్పు విమాన ప్రయాణ ఖర్చులలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. గత నెల ప్రారంభంలో జనవరి 1న, ATF ధరలు తగ్గాయి. ఢిల్లీలో ATF ధర దాదాపు 7% తగ్గింది. ఇంకా CNG-PNG ధరలలో కూడా మార్పులు కనిపించవచ్చు.
ఈ మార్పు ఇది పాన్-మసాలా, సిగరెట్ ప్రియులకు షాక్ ఇవ్వబోతోంది. నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 1, 2026 నుండి దేశంలో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై అధిక పన్నులు విధించే అవకాశం ఉంది. PTI నివేదిక ప్రకారం, GST పరిహార సెస్ స్థానంలో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను నోటిఫై చేసింది. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వర్తించే GST రేట్లకు అదనంగా పొగాకు, పాన్ మసాలాపై కొత్త పన్నులు విధింనుంది. GSTతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించనుంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఫిబ్రవరి 1, 2026 నుండి FASTag వినియోగదారులకు కూడా నియమాలు మారుతాయి. ఫిబ్రవరి 1 నుండి కార్లు, జీపులు, వ్యాన్ల కోసం FASTags జారీ చేయడానికి KYC ధృవీకరణ ప్రక్రియను NHAI నిలిపివేసింది. ఇది గణనీయమైన ఉపశమనం అనే చెప్పాలి. కొత్త నెల మొదటి రోజు నుండి అందుబాటులో ఉంటుంది.
వచ్చే నెలలో మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని ఉంటే ఇంటి నుండి బయలుదేరే ముందు బ్యాంక్ సెలవుల జాబితాను తనిఖీ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం, ఏడు రోజుల వారపు సెలవుతో సహా, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి సందర్భాలలో దాదాపు 10 రోజుల సెలవులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: రూ.2 లక్షలకు చేరువలో బంగారం ధర.. వెండి ఎంతో తెలుసా..?
మరిన్నిబిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి