
పక్షం రోజులుగా బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అయినా.. మధ్యతరగతి వారికి బంగారం ధరలు అందనంత ఎత్తున ఉన్నాయి. సామాన్యులు బంగారం కొనడం కాదు బంగారాన్ని చూడాలన్న భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ స్థాయిలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి ఇప్పుడు ల్యాబ్ మేడ్ గోల్డ్ అందుబాటులోకి వచ్చింది.

సాధారణంగా బంగారాన్ని బంగారం ఘనుల నుండి తయారు చేస్తారు. కానీ ఈ ల్యాబ్ మేడ్ హోల్డ్ ను ల్యాబ్‌లో తయారు చేస్తారు. ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లో ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని తయారు చేసే ల్యాబ్‌లు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు.

బంగారానికి ఏమాత్రం తీసుపోని విధంగా ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ ఉండటంతో మధ్యతరగతి వారు ఎక్కువగా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. ఒరిజినల్ బంగారం నగలు కొనాలంటే దాదాపు ఒక్కొక్క నగకు సుమారు మూడు నుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కానీ ఈ ల్యాబ్ మేడ్ హోల్డ్ లో సేమ్ అదే నగలు మూడు నాలుగు నుండి ఏడు వేల మధ్యలోనే దొరుకుతాయంటున్నారు ల్యాబ్ మేడ్ గోల్డ్ షో యజమానులు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్లిలో బంగారాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి.

కాబట్టి కొంత బంగారాన్ని ఉపయోగించి.. మిగతాది అంతా కూడా ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని వాడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. ఈ ల్యాబ్ మెట్ గోల్డ్.. బంగారానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చూసేవాళ్ళు ఎవరు కూడా ఇది బంగారం కాదంటే నమ్మలేని పరిస్థితని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.