
ఆర్బీఐ కొత్త ఏడాదికి ముందే ప్రతీసారి బ్యాంక్ సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్ల అనుమానాలను తొలగించేందుకు ముందే సెలవుల జాబితా అధికారింగా విడుదల చేస్తూ ఉంటుంది. దీని వల్ల కస్టమర్లు బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయనేది ముందే తెలుసుకుని జాగ్రత్త పడతారు. అలాగే ఉద్యోగులు కూడా తాము చేయాల్సిన పెండింగ్ పనులను ఏమైనా ఉంటే సెలవుల కంటే ముందే పూర్తి చేస్తారు. మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదికి దేశ ప్రజలందరూ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పబోతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే బ్యాంకుల సెలవు తేదీలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారంలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు మూతపడతాయనేది తెలుసుకుందాం.
ఆర్బీఐ ప్రకటించే బ్యాంక్ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక పండుగలను పరిగణలోకి తీసుకుని ఆర్బీఐ బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే. జనవరిలో సంక్రాంతి(15వ లేదీ), రిపబ్లిక్ డే రోజు(రిపబ్లిక్ డే) రోజు బ్యాంకులు పనిచేయవు.
-ఇక ఫిబ్రవరిలో ఎలాంటి సెలవులు లేకపోగా.. మార్చిలో హోలీ(3వ తేదీ), ఉగాది(19వ తేదీ), రంజాన్(ఏపీలో 20) తెలంగాణలో(21వ తేదీ), శ్రీరామనవవి(27వ తేదీ) సెలవులు ప్రకటించారు.
-ఇక ఏప్రిల్‌లో ఆర్ధిక సంవత్సరం ప్రారంభం 1వ తేదీ, గుడ్ ఫ్రైడ్(3వతేదీ), అంబేడ్కర్ జయంతి(14వ తేదీ) బ్యాంకులు క్లోజ్ కానుండగా..
-మేడే(1), బ్రకీద్(మే27)న సెలవులు ప్రకటించారు
-జూన్‌లో మెహర్రం(ఏపీలో 25వ తేదీ, తెలంగాణలో 26వ తేదీ) సెలవులు ఇచ్చారు
-ఇక జులైలో బ్యాంకులకు ఎలాంటి సెలవులు లేకపోగా.. ఆగస్టులో స్వాత్రంత్య దినోత్సవం(15), మిలాద్ ఉన్ నబీ(ఏపీలో 25, తెలంగణలో 26వ తేదీ) బ్యాంకులకు సెలవులు ఇచ్చారు.
-ఇక సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి(4వ తేదీ), వినాయక చవితి(14వ తేదీ) మూతపడనున్నాయి.
-అక్టోబర్‌లో గాంధీ జయంతి(2వ తేదీ), దసరా(20వ తేదీ) పనిచేయవు.
-ఇక నవంబర్‌లో గురునానక్ జయంతి(24వ తేదీ), దీపావళి(8వ తేదీ) సెలవులు వచ్చాయి
-ఇక డిసెంబర్‌లో 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.