
Jio Plan: టెలికాం వినియోగదారుల కోసం రిలయన్స్ జియో మరో ఆసక్తికరమైన రీఛార్జ్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. రూ.450తో రీఛార్జ్ చేస్తే 36 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా 28 రోజుల ప్లాన్‌లతో పోలిస్తే అదనంగా 8 రోజుల వ్యాలిడిటీ రావడం ఈ ప్లాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 36 రోజుల కాలానికి మొత్తం 72GB డేటా వినియోగించుకోవచ్చు.
రోజువారీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత వేగం తగ్గుతుంది. 5G స్మార్ట్‌ఫోన్ ఉన్న జియో వినియోగదారులకు ఈ ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. మీ ప్రాంతంలో Jio True 5G సేవ అందుబాటులో ఉండి, మీరు అర్హత కలిగిన ప్లాన్/డివైజ్ ఉపయోగిస్తే Unlimited 5G డేటా ప్రయోజనం పొందవచ్చని జియో వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో కాల్స్, SMS కూడా అందుబాటులో ఉంటాయి. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, అలాగే ప్రతిరోజూ 100 SMS కూడా ఉచితంగా లభిస్తాయి.
ఇది కూడా చదవండి: AI Washing Machine: ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ఇక ఈ ప్లాన్‌లో మొబైల్ కనెక్టివిటీతో పాటు JioHotstar వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. Jio అధికారిక ప్లాన్ లిస్టింగ్‌లో ఈ ప్యాక్‌ను 5G + AI + JioHotstar” కేటగిరీలో చూపిస్తోంది. రోజూ మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించే వారు, 5G స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు, OTT కంటెంట్ చూసేవారు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా 28 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి 36 రోజుల ప్లాన్ ఉపయోగకరంగా ఉండొచ్చు.
అయితే ఈ ప్లాన్ తీసుకునే వారు రీఛార్జ్ చేసే ముందు MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్‌లో మీ నంబర్‌కు రూ.450 ప్లాన్, దాని ప్రస్తుత ప్రయోజనాలు కనిపిస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేయడం మంచిది. టెలికాం కంపెనీలు ప్రత్యేక ఆఫర్ల ప్రయోజనాలను ఎప్పటికప్పుడు మార్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Post Office: ఇందులో దాస్తే మీ డబ్బు డబుల్ అవ్వడం ఖాయం.. రూ.10 లక్షలకు రూ.20 లక్షలు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి