
ఓటీటీ సేవల విస్తృతి బాగా పెరిగింది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఓటీటీ సేవలను వినియోగిస్తున్నారు. ఇక టెలికం సంస్థలు సైతం యూజర్లను ఆకట్టుకునేందుకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రియలన్స్ జియో తమ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ రీఛార్జ్ ప్లాన్ ఏంటి.? దీనివల్ల లభించే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రియలన్స్ జియో తాజాగా రూ. 857తో ప్రత్యేకంగా ఓ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లకు ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను అందిస్తోంది. దీంతోపాటు జియోకు చెందిన జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలను కూడా పొందొచ్చు. రోజుకు 2 జీబీ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌తో వస్తుంది.
అయితే 5జీ నెట్‌వర్క్ లాంచింగ్ నేపథ్యంలో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిడెట్ 5జీ డేటాను పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. జియో సినిమాలో ప్రీమియం యూజర్లకు ఈ ప్లాన్‌తో లభించదు. అలాగే రీఛార్జ్ వ్యాలిడిటీ ముగియగానే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ సైతం ముగిసిపోతుంది. ఐపీఎల్ యూజర్లకు కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కాగా జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం కూడా ప్రత్యేకంగా ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో రూ. 234తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, జియోసావన్, జియో సినిమా వంటి సబ్‌స్క్రిప్షన్స్ పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..