RBI: ఇకపై ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకోవడానికి కార్డుతో పనిలేదు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ..

|

Apr 08, 2022 | 1:05 PM

RBI: మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్‌ రంగంలోనూ మార్పలు వచ్చాయి. ఒకప్పుడు అకౌంట్‌లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి, క్యూలైన్‌లో నిల్చొని, రశీదు నింపి.. ఇలా పెద్ద తతంగం ఉండేది. అయితే యూపీఐ పేమెంట్స్‌...

RBI: ఇకపై ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకోవడానికి కార్డుతో పనిలేదు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బీఐ..
Rbi
Follow us on

RBI: మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్‌ రంగంలోనూ మార్పలు వచ్చాయి. ఒకప్పుడు అకౌంట్‌లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి, క్యూలైన్‌లో నిల్చొని, రశీదు నింపి.. ఇలా పెద్ద తతంగం ఉండేది. అయితే యూపీఐ పేమెంట్స్‌ (UPI Payments) వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పులొచ్చాయి. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు వెంటనే ఒక అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌కు డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే రోజులు వచ్చేశాయి. ఇక డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎమ్‌లు కూడా వచ్చేశాయి. అయితే ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా ఏటీఎమ్‌ కార్డు ఉండాల్సిందే. కానీ ఇకపై ఏటీఎమ్‌ కార్డు అవసరం లేకుండానే ఏటీఎమ్‌ ద్వారా డబ్బులు తీసుకునే రోజులు రానున్నాయి.

ఇప్పటికే ఈ అవకాశం కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నా.. మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ లాంటి వ్యవహారాలు ఉన్నాయి. అయితే అలా కాకుండా కేవలం స్మార్ట్‌ ఫోన్‌లోని యూపీఐ యాప్‌ను ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ విషయమై తాజాగా ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. శుక్రవారం ఆర్‌బీఐ మానిటరి పాలసీ సమవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీఐ ద్వారా ఏటీఎమ్‌ను డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

ప్రస్తుతం కొన్ని ఏటీఎమ్‌లలో కార్డ్‌ లెస్‌ క్యాష్ విత్‌డ్రాయల్‌ సదుపాయం ఉందని అయితే యూపీఐ ద్వారా అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. దీంతో కార్డ్‌ క్లోనింగ్‌, కార్డ్‌ స్కిమ్మింగ్‌ లాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఇక ఏటీఎమ్‌లలో యూపీఐ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకొని. స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌ సహాయంతో స్కాన్‌ చేసి అమౌంట్‌ ఎంటర్‌ చేయడం ద్వారా డబ్బులు పొందొచ్చు.

Also Read: Viral Video: టోపీలా మారే మేఘాన్ని ఎప్పుడైనా చూశారా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోపై ఓ లుక్కేయండి..

Ramadan 2022: ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ కానుక.. రంజాన్ ప్రారంభమైన నేపథ్యంలో కీలక నిర్ణయం..

Andhra Pradesh: సీఎం జగన్ గుడ్‌న్యూస్.. నేడు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ