
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకింగ్ కస్టమర్ల కోసం మరికొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇక నుంచి బ్యాంకులు ఎలా పడితే అలా మీ అకౌంట్ నుంచి మనీ ఆటోడెబిట్ చేసుకోవడానికి వీల్లేదు. కస్టమర్ల భద్రత కోసం ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ఆటో డెబిట్ చేయాలంటే కస్టమర్‌కు తప్పనిసరిగా 24 గంటల ముందు ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత కట్ చేస్తు్న్నారు..? దానికి గల కారణాన్ని తెలపాల్సి ఉంటుంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఇన్యూరెన్స్ ప్రీమియం, కారు లోన్ ఈఎంఐ, హోమ్ లోన్ వంటి వాటన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఆటో డెబిట్ చేసుకుంటే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు.
ఆటో డెబిట్ చేసుకోవాలనుకుంటే 24 గంటల ముందు బ్యాంకులు మీకు నోటిఫికేషన్ పంపుతాయి. దీని వల్ల ఈఎంఐకు అవసరమైన డబ్బులను మీరు అకౌంట్లో ఉంచుకుంటారు. దీని వల్ల మీరు లేట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ఒకవేళ ఆటో డెబిట్ తప్పు అని భావిస్తే మీరు బ్యాంక్ పంపించే నోటిఫికేషన్ ద్వారా రద్దు చేసుకోవచ్చు. బ్యాంకులు ఇక నుంచి ఇష్టానుసారం కస్టమర్‌కు ముందుగానే సమాచారం ఇవ్వకుండా డబ్బులు ఆటో డెబిట్ చేసుకోకూదు. ముందుగా మీ అనుమతి, మీకు సమాచారం ఇచ్చాకే ఆటో డెబిట్ చేసుకోవాలి. ముందుగానే వచ్చే మెస్సేజ్ ద్వారా వివరాలు ఏదైనా తప్పు ఉంటే బ్యాంకును సంప్రదించవచ్చు. అమౌంట్ తప్పుగా ఉంటే సవరించుకోవచ్చు.
ఒకవేళ 24 గంటల ముందే బ్యాంకులు మీకు ఆటో డెబిట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వకపోతే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. ఇక వినియోగదారుడి సమ్మతి లేకుండా ఒక్క రూపాయి కూడా బదిలీ చేసుకునే హక్కు బ్యాంకులకు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులు దీనిని తప్పనిసరిగా పాటించాలని ఆర్బీఐ కొత్త నిబంధనల్లో పేర్కొంది. చాలామంది ఈఎంఐల గురించి మర్చిపోతారు. దీని వల్ల ఈఎంఐ సమాయానికి అకౌంట్‌లో డబ్బులు లేకపోతే బ్యాంకులు బౌన్స్ ఛార్జీలు విధిస్తూ ఉంటాయి. ఇక నుంచి అలాంటి ఛార్జీలు మీకు ఉండవు. బ్యాంకులు ముందే సమాచారం ఇవ్వడం వల్ల మీ అకౌంట్లలో ఆ టైమ్‌కి డబ్బులు ఉంచుకుంటారు. బౌన్స్ ఛార్జీలను బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. దీనికి ఇప్పటినుంచి చెక్ పడనుందని చెప్పవచ్చు.