Ration Card: రేషన్‌కార్డు దారులకి శుభవార్త.. త్వరలో ఆ పనులు కూడా అక్కడే..!

|

Apr 10, 2022 | 8:19 PM

Ration Card: ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఉన్న రేషన్ దుకాణం మునుపటి కంటే మరింత ప్రభావవంతంగా మారబోతుంది. ఇప్పటి వరకు రేషన్‌ దుకాణం నుంచి బియ్యం, మైదా, ఉప్పు

Ration Card: రేషన్‌కార్డు దారులకి శుభవార్త.. త్వరలో ఆ పనులు కూడా అక్కడే..!
Ration Shops
Follow us on

Ration Card: ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఉన్న రేషన్ దుకాణం మునుపటి కంటే మరింత ప్రభావవంతంగా మారబోతుంది. ఇప్పటి వరకు రేషన్‌ దుకాణం నుంచి బియ్యం, మైదా, ఉప్పు వంటివి మాత్రమే తీసుకునేవారు. కానీ త్వరలో బ్యాంకు లావాదేవీలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రేషన్ షాపును ‘కామన్ సర్వీస్ సెంటర్’గా గుర్తించి ఉద్యోగులను ‘బ్యాంక్ మిత్ర’గా నియమించేందుకు ఆమోదం తెలిపిందని ఆహార శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకింగ్ నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వ్యవస్థ పనితీరు, రేషన్ షాపులు బ్యాంకులకి ఎలా సహాయం చేస్తాయి.. ఆ పనికి ఎంత కమీషన్ ఇస్తారు తదితర అంశాలపై చర్చించేందుకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు సంస్థల అగ్రనేతలను ఢిల్లీకి ఆహ్వానించారు. వారు ఇప్పటికే కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులలో ఒకరైన కన్వల్‌జిత్ షోర్‌తో సమావేశమయ్యారు.

నివేదికల ప్రకారం వారు రాబోయే కొద్ది రోజుల్లో ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతారని సమాచారం. రేషన్ షాపుల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. దీంతో వాటిని బ్యాంకింగ్ లావాదేవీలకు ప్రధాన కేంద్రంగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకుల వద్ద జనాల రద్దీని తగ్గించేందుకు కూడా ఈ పని చేయనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల బ్యాంకుల మధ్య ఇంటర్‌బ్యాంక్ లావాదేవీలు కూడా పెరుగుతాయి. ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థను ఉపయోగించి ఆన్‌లైన్ లావాదేవీలని మెరుగుపరచనున్నారు. ఇందుకు వినియోగదారుడు రేషన్ దుకాణంలో ఆధార్ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

 

Viral Video: డీజె ఎఫెక్ట్‌.. స్టేజ్‌పైనే డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు.. బిత్తరపోయిన పెళ్లికొడుకు..!

Solar Panels: కొత్త యుగం సోలార్ ప్యానెల్.. రాత్రిపూట కూడా విద్యుత్ ఉత్పత్తి..!

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌.. అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్‌ ప్లేస్‌..!