Indian Railways: వామ్మో.. టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి వసూలు అయ్యింది ఇన్ని కోట్లా?

|

Apr 10, 2024 | 9:25 PM

ప్రయాణీకులు సాధారణంగా సౌకర్యవంతమైన సుదూర ప్రయాణాలకు భారతీయ రైల్వేలను ఉపయోగిస్తారు. రైల్వేశాఖ పలుమార్లు హెచ్చరించినా టికెట్లు లేకుండానే చాలా మంది రైలులో ప్రయాణిస్తున్నారు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, జరిమానా, జైలు లేదా రెండూ శిక్షార్హమైన నేరమని చాలా మందికి అర్థం కాదు. ఇలాంటి..

Indian Railways: వామ్మో.. టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి వసూలు అయ్యింది ఇన్ని కోట్లా?
Indian Railways
Follow us on

ఇండియన్‌ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ఇక దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వేనే. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తక్కువ ఛార్జీలతో సామన్యులకు సైతం అందుబాటులోకి ఉంటుంది. అయితే రైల్వేలో నియమ నిబంధనలు చాలా ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే కేసులతో పాటు జరిమానా కూడా విధిస్తుంటారు. ప్రయాణీకులు సాధారణంగా సౌకర్యవంతమైన సుదూర ప్రయాణాలకు భారతీయ రైల్వేలను ఉపయోగిస్తారు. రైల్వేశాఖ పలుమార్లు హెచ్చరించినా టికెట్లు లేకుండానే చాలా మంది రైలులో ప్రయాణిస్తున్నారు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, జరిమానా, జైలు లేదా రెండూ శిక్షార్హమైన నేరమని చాలా మందికి అర్థం కాదు. ఇలాంటి వాటి నుంచి రైల్వేలు భారీ జరిమానాలు వసూలు చేస్తున్నాయి.

ఈ టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన ప్రయాణికుల నుంచి ఒక సంవత్సరంలో రైల్వే రూ.173.89 కోట్ల జరిమానా వసూలు చేసింది. పశ్చిమ రైల్వే ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు ఎక్కువ టిక్కెట్ తనిఖీ కార్యకలాపాలను నిర్వహించింది. ఫలితంగా రైల్వే శాఖ రూ.173.89 కోట్లు వసూలు చేయగా, అందులో ముంబై నుంచి రూ.46.90 కోట్లు వసూలయ్యాయి.

గత మార్చిలోనే 16.77 కోట్ల రూపాయలు పెనాల్టీగా వసూలు చేసింది రైల్వే శాఖ. పశ్చిమ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ విభాగం అందించిన సమాచారం ప్రకారం, ఈ సమాచారం మార్చి 2024 నెలలో వెలుగులోకి వచ్చింది. AC లోకల్ రైళ్లలో అనధికార ప్రయాణాలను ఆపడానికి రెగ్యులర్ టిక్కెట్ చెకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ ఫలితంగా, ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు, సుమారు 60 వేల మంది ప్రయాణికులకు జరిమానా విధించారు రైల్వే అధికారులు. గతేడాది కంటే ఈ సంఖ్య 25 శాతం ఎక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి