Business Idea: ఈ బిజినెస్‌తో మంచి లాభాలు.. అస్సలు ఢోకా ఉండదు

దీంతో హాస్టల్స్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీనిని మంచి బిజినెస్‌ అవకాశంగా మార్చుకోవచ్చు. బాయ్స్‌తో పాటు గర్ల్స్‌ కోసం ప్రత్యేకంగా హాస్టల్స్‌ను ఏర్పాటు చేయొచ్చు. కాలేజీలు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే చోటును సెలక్ట్‌ చేసుకొని హాస్టల్స్‌ను ఓపెన్‌ చేయాలి. ఇందుకోసం ఒక బిల్డింగ్‌ లేదా అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవాల్సి..

Business Idea: ఈ బిజినెస్‌తో మంచి లాభాలు.. అస్సలు ఢోకా ఉండదు
Business Idea

Updated on: Jan 27, 2024 | 8:50 PM

ప్రస్తుతం రోజులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎక్కువ మంది సొంతూళ్లలోనే ఉండి చదువుకునే వారు. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్‌ కారణంగా సొంతూళ్లను వదిలి పట్టణాల బాట పడుతున్నారు. చదువుకోసం కొందరు, చదువు పూర్తయ్యక ఉద్యోగం కోసమని మరికొందరు నగరాల బాటపడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ లాంటి పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ వలసలు, ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి.

దీంతో హాస్టల్స్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీనిని మంచి బిజినెస్‌ అవకాశంగా మార్చుకోవచ్చు. బాయ్స్‌తో పాటు గర్ల్స్‌ కోసం ప్రత్యేకంగా హాస్టల్స్‌ను ఏర్పాటు చేయొచ్చు. కాలేజీలు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే చోటును సెలక్ట్‌ చేసుకొని హాస్టల్స్‌ను ఓపెన్‌ చేయాలి. ఇందుకోసం ఒక బిల్డింగ్‌ లేదా అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. కోచింగ్‌ సెంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసే హాస్టల్స్‌లో నష్టం అనేది ఉండదు. అయితే ఇందుకోసం కొంతమేర పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

బిల్డింగ్‌ అద్దెతో పాటు కిచెన్‌ సామాగ్రి, గదులలో బెడ్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మీ వ్యాపారానికి తిరుగే ఉండదు. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌ అందించాల్సి ఉంటుంది. ఆహారం విషయంలోనే చాలా హాస్టల్స్‌ ఫెయిల్‌ అవుతుంటాయి. అలా కాకుండా మంచి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మీ వ్యాపారానికి ఢోకా ఉండదు. ఇక ఇంటర్‌ నెట్‌ వంటి సదుపాయం కల్పించిన ఎక్కువ మంది జాయిన్‌ కావడానికి అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న తరుణంలో కనీసంలో కనీసం ఒక్క వ్యక్తి నుంచి ప్రైవేట్‌ హాస్టల్స్‌ నెలకు రూ. 4 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక హాస్టల్‌ ఏర్పాటు చేసిన తర్వాత పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలతో పాటు విద్యా సంస్థల వద్ద హాస్టల్‌కు సంబంధించిన పోస్టర్లను అతికించాలి. సోషల్‌ మీడియా ద్వారా కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు. మంచి సదుపాయాలతో హాస్టల్‌ను నిర్వహిస్తే హాస్టల్‌ వ్యాపారం ద్వారా నెలకు రూ. లక్ష వరకు ఆర్జించవచ్చు. ఆదాయం అనేది సభ్యులు చేరిన లెక్క, మీరు హాస్టల్‌ ఏర్పాటు చేసే ప్రదేశంలో ఉన్న అద్దెపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..