Post Office Schemes: బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిని అందించే పోస్టాఫీసులో ఈ మూడు పథకాలు..

Post Office Schemes: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత రెండు నెలల్లో రెండు విడుతలుగా వడ్డీ రేట్లను పెంచింది. ఫలితంగా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా స్వల్ప కాలిక డిపాజిట్లపై..

Post Office Schemes: బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిని అందించే పోస్టాఫీసులో ఈ మూడు పథకాలు..

Updated on: Jun 29, 2022 | 1:07 PM

Post Office Schemes: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత రెండు నెలల్లో రెండు విడుతలుగా వడ్డీ రేట్లను పెంచింది. ఫలితంగా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా స్వల్ప కాలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వంటి అగ్ర బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేట్లు కంటే తక్కువగా ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ (PPF), సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లపై మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేటు విధానంలో బ్యాంకు ఫిక్స్‌డ్‌డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని అందుకోవాలని చూస్తున్న వారు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పోస్ట్‌ ఆఫీస్‌ పొదుపు పథకాలను ఎంచుకోవచ్చు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌:

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అనేది ఒక చిన్న పొదుపు పథకం. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల కంటే మెరుగైన రాబడిని పొందాలని ఆశిస్తున్న సీనియర్‌ సిటిజన్‌లలో NPS, PMVVY అనేది పెట్టుబడి ఎంపిక. సీనియర్‌ సిటిజన్స్‌ 55 ఏళ్లలోపు కానీ 60 ఏళ్ల లోపు వారు పెట్టుబడి పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా:

పీపీఎఫ్‌ అనేది మంచి ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటి. ఇందులో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వార్షిక పద్దతుల్లో పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టం మినమాయింపుల సెక్షన్‌ 80Cకి అర్హులు. పీపీఎఫ్‌లు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు.

సుకన్య సమృద్ధి పథకం:

పోస్టాఫీసులో ఈ పథకం తమ కూతురి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం రూపొందించబడింది. పదేళ్లలోపు వారి ఆడపిల్లల తరపున సంరక్షకులు SSA ఖాతాలను తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల వరకు ఒక అమ్మాయి పేరుతో భారతదేశంలో ఒక ఖాతాను మాత్రమే తెరవవచ్చు. ఇందులో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్‌తో SSA ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత గరిష్టంగా 15 సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా డిపాజిట్లపై పన్ను మినహాయింపు రూ. సెక్షన్ 80C కింద సంవత్సరానికి 1.5 లక్షలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us