PMKVY: పీఎం కౌశల్ వికాస్ యోజన స్కామ్‌..! బ్లాక్‌ లిస్ట్‌లో 178 ట్రైనింగ్‌ సెంటర్లు.. టాప్‌లో ఏ స్టేట్‌ అంటే..?

ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) అమలులో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. నకిలీ శిక్షణార్థులు, నకిలీ పత్రాలు, అసలు లేని శిక్షణ కేంద్రాలతో నిధులు దుర్వినియోగమయ్యాయి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ 178 శిక్షణ భాగస్వాములను, కేంద్రాలను బ్లాక్‌లిస్ట్ చేసింది. PMKVY లక్ష్యాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు హెచ్చరించింది.

PMKVY: పీఎం కౌశల్ వికాస్ యోజన స్కామ్‌..! బ్లాక్‌ లిస్ట్‌లో 178 ట్రైనింగ్‌ సెంటర్లు.. టాప్‌లో ఏ స్టేట్‌ అంటే..?
Pmkvy

Updated on: Nov 07, 2025 | 3:29 PM

యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి రూపొందించిన ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) అమలులో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి . శిక్షణార్థులు లేకపోవడం, నకిలీ పత్రాలు, శిక్షణ కేంద్రాలు లేకపోవడం వంటి అనేక అవకతవకలు జరిగినట్లు సమాచారం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటివరకు (జూన్ 2025) 1.64 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. 2022లో ఈ పథకం నాల్గవ ఎడిషన్ (PMKVY 4.0) ప్రారంభించినప్పటి నుండి, వివిధ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.

నకిలీ బిల్లులు, విద్యార్థులు శిక్షణకు హాజరు కాకపోవడం, నకిలీ పత్రాలు సృష్టించి ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు డబ్బులు దోచేసిట్లే సమాచారం. కొన్ని చోట్ల అసలు ట్రైనింగ్‌ సెంటర్లు లేకుండానే డబ్బులు దొబ్బేశారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన నియమాలను పాటించని వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 30న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ డైరెక్టరేట్లకు లేఖ రాసింది.

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన 178 శిక్షణ భాగస్వాములు (TPలు), శిక్షణ కేంద్రాలను (TCలు) నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (NSDC) బ్లాక్ లిస్ట్ చేశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా TPలు, TCలు బ్లాక్ లిస్ల్‌లో చేరాయి. ఈ రాష్ట్రం నుండి 59 మందిని బ్లాక్ లిస్ట్‌లో చేరారు. ఢిల్లీ (25), మధ్యప్రదేశ్ (24), రాజస్థాన్ (20) కూడా పెద్ద సంఖ్యలో శిక్షణ భాగస్వాములు, శిక్షణా కేంద్రాలను బ్లాక్ లిస్ట్‌లో చేరారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి