రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షల సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?

PM KUSUM 2.0: దేశంలోని అన్నదాతలకు కేంద్ర మరో శుభవార్త చెప్పబోతుంది. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు పీఎం కుసుమ్ రెండో విడతను ప్రారంభించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర ప్రకటించింది. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి రూ.20లక్షల వరకు ఆదాయం పొందవచ్చని చెబుతోంది అదెలానో తెలుసుకుందాం పదండి.

రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షల సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?
Farmer Income Scheme

Updated on: Apr 09, 2026 | 3:01 PM

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, వారి ఆధాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పీఎం కిసాన్‌ను, పీఎం కుసుమ్ అనే రెండు పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. పీఎం కిసాన్ కింద రైతులకు ఏడాదిలో రెండు సార్లు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అలాగే పీఎం కుసుమ్ కింద పంట సాగు చేయని భూముల్లో విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. తద్వారా 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హారిత ఇంధనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా మరో నిర్ణయం తీసుకంది. పీఎం కుసుమ్ 2.0ను కూడా ప్రారంభించనున్నట్టు ఇందన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్తును అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.7 మిలియన్ల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం ప్రతిరోజూ 11 వేల నుంచి 12 వేల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఇన్ స్టాల్ చేస్తున్నామన్నారు. వచ్చే నెల నాటికి ఈ సంఖ్యను రోజుకు 15-16 వేలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

రైతుల ఆదాయానికి బాటలు.. ఏడాది 20లక్షల ఆదాయం

అయితే ప్రభుత్వం తీసుకొచ్చి ఈ కొత్త పథకం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని మరింత పెంచుకొవచ్చు. సాగుకు పనికిరాని బంజరు భూములు ఉన్న రైతులకు ఈ పథకం ఒక వరప్రసాదం వంటిది. దీని ద్వారా రైతులు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారి లక్షల్లో సంపాదించవచ్చు.

సాగు చేయని భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు

ఒక రైతు తన సాగు చేయని భూమిలో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే 0.5 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి సుమారు రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుంది. అయితే ఇందులో సుమారు 70 శాతం నిధులను రైతులకు బ్యాంకులు రుణంగా అందజేస్తాయి. మిగతా పెట్టుబడిని రైతులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఏడాది ఉత్పత్తి, రైతు సంపాదన

ఈ సోలార్ ప్లాంట్ నుంచి ఏడాదికి సుమారు 7.5 లక్షల నుంచి 8 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలే నేరుగా కొనుగోలు చేస్తాయి. అయితే యూనిట్‌కు రూ.3.13 ధర చొప్పున లెక్కిస్తే, ఏడాదికి రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రైతులకు ఆదాయం వస్తుంది. రైతులు బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్‌ EMI , నిర్వహణ ఖర్చులు పోగా రైతుకు నికరంగా వారికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లాభం మిగిలే అవకాశం ఉంది.

రైతులకు మరో బినిఫిట్

అయితే ఈ పథంలో ఉన్న మరో బెనిఫిట్ ఏమిటంటే ఒకే రైతుకు పెట్టుబడి కష్టమైతే, రైతు సంఘాలు లేదా గ్రూపులుగా ఏర్పడి కూడా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. పంటలు పండించకుండా ఊరికే భూములను బీడు పెట్టే బదులు ఇలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులు శాశ్వత ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us