Telugu News Business PM KISAN FPO Scheme: Modi Government Provides Financial Assistance of Rs 15 Lakh to Farmer Groups
PM KISAN FPO: రైతుల ఖాతాల్లోకి రూ.15 లక్షలు.. మోదీ ప్రభుత్వం భారీ గిఫ్ట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
రైతు పథకం లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది మోదీ ప్రభుత్వం. ప్రభుత్వం మరోసారి రైతులకు పెద్దపీట వేస్తోంది. ఈసారి రైతులు భారీ మొత్తాన్ని అందుకోబోతున్నారు. రైతుల ఆదాయాన్ని..
రైతును రాజును చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా మోదీ సర్కార్ దూసుకుపోతోంది. రైతులకు మరింత ఆర్ధికంగా ఆదుకునేందుకు ఓ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తోంది మోదీ ప్రభుత్వం. అయితే మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో రెండు వేలు కాదు ఏకంగా రూ.15 లక్షలను ఇస్తోంది. రైతు పథకం లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం మరోసారి రైతులకు పెద్దపీట వేస్తోంది. ఈసారి రైతులు భారీ మొత్తాన్ని అందుకోబోతున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈసారి మరో పెద్ద అడుగు వేసింది. వాస్తవానికి కిసాన్ యోజన కింద గతంలో రూ.6వేలు ఇస్తుండగా, ఇప్పుడు కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం రైతులకు రూ.15 లక్షలు ఇస్తోంది.