
Diwali Bonus: దీపావళి వస్తోంది. అందరూ దీపావళి బహుమతులు, బోనస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ప్రజల ముఖాల్లో ఆనందాన్ని నింపిన ఒక సందేశం వైరల్ అవుతోంది. దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ అందరికీ రూ. 8 వేల బోనస్ ఇస్తున్నారని పేర్కొంటూ ఈ సందేశం వాట్సాప్‌లో వైరల్ అవుతోంది.
చాలా మంది ఈ సందేశం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సందేశం నిజమేనా? కేంద్ర ప్రభుత్వం నిజంగానే రూ.8,000 బహుమతిని ప్రకటించిందా? దీని గురించి తెలుసుకుందాం..
వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్త నకిలీదని, అది మిమ్మల్ని ఒక వెబ్‌సైట్‌కు తీసుకువెళుతుందని పీఐబీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘X’ ద్వారా తెలిపింది. ఈ వెబ్సైట్ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతుంది. ఇలాంటి ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల డబ్బు నష్టం జరగవచ్చు. అలాంటి ఏ లింక్‌పైనా క్లిక్ చేయవద్దు. అపరిచితులతో తమ ఓటీపీని పంచుకోవద్దని కూడా పీఐబీ ప్రజలను హెచ్చరించింది. దీని ద్వారా మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ సూచించింది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సమాచారం మీకు కనిపిస్తే, మీరు పీఐ ఫ్యాక్ట్ చెక్‌ను సంప్రదించవచ్చు. పీఐ ఫ్యాక్ట్ చెక్కు సమాచారం అందించడానికి, మీరు వారి మొబైల్ నంబర్ 8799711259, ఈమెయిల్ ఐడి factcheck@pib.gov.in ద్వారా సంప్రదించవచ్చు. పీఐతో పాటు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ నకిలీ సందేశం గురించి ప్రజలను హెచ్చరించింది.
సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో, ముఖ్యంగా వాట్సాప్‌లో వ్యాపిస్తున్న వార్తలలో, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి పేరు మీద దీపావళి బోనస్ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోటోతో పాటు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పేరు మీద రూ. 8000 దీపావళి బోనస్ ఇస్తోందని కూడా ఆ మెసేజ్‌లో ఉంది. కానీ, ఈ మెసేజ్ తప్పు, నకిలీదని మేము మీకు తెలియజేస్తున్నాము.
ఇది కూడా చదవండి: RBI Notes: దీపావళికి రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? ఆర్బీఐ సంచలన ప్రకటన
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి