విపణిలోకి ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఆటో..

ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ 3 వీలర్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఆపే ఈ-సిటీ పేరుతో తెచ్చిన ఈ త్రీ వీలర్ ఆటో ధరను రూ.1.97 లక్షలుగా నిర్ణయించింది. దీనికి మార్చుకునే వీలుండే లిథియం ఐయాన్ బ్యాటరీతో ఈ ఆటో వస్తుంది. ఇక బ్యాటరీ, ఛార్జింగ్‌ సదుపాయాల కోసం.. సన్‌ మొబిలిటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ పియాజియో సంస్థకు ఎలక్ట్రిక్ టెక్నాలజీను అభివృద్ది చేయడంలో పదిహేనేళ్ల అనుభవం ఉందని.. దీని ద్వారానే […]

విపణిలోకి ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఆటో..
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 12:54 AM

ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ 3 వీలర్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఆపే ఈ-సిటీ పేరుతో తెచ్చిన ఈ త్రీ వీలర్ ఆటో ధరను రూ.1.97 లక్షలుగా నిర్ణయించింది. దీనికి మార్చుకునే వీలుండే లిథియం ఐయాన్ బ్యాటరీతో ఈ ఆటో వస్తుంది. ఇక బ్యాటరీ, ఛార్జింగ్‌ సదుపాయాల కోసం.. సన్‌ మొబిలిటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది.

ఈ పియాజియో సంస్థకు ఎలక్ట్రిక్ టెక్నాలజీను అభివృద్ది చేయడంలో పదిహేనేళ్ల అనుభవం ఉందని.. దీని ద్వారానే ఇండియన్ మార్కెట్‌లోకి ఉత్పత్తులు తీసుకొచ్చామని.. ఆ సంస్థ ఎండీ, సీఈవో డియాగో గ్రఫీ తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా.. బ్యాటరీలను అభివృద్ధి చేశామని.. మార్చుకునే అవకాశం ఉండే బ్యాటరీతో పాటుగా.. ఫిక్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీ కూడా డెవలప్ చేశామన్నారు. వచ్చే సంవత్సరం రెండో క్వార్టర్లీ నాటికి.. ఫిక్స్‌డ్‌ బ్యాటరీ త్రీ వీలర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ప్యాసెంజర్‌, గూడ్స్‌ క్యారేజ్‌ విభాగంలో కూడా.. ఎలక్ట్రిక్‌ వెర్షన్లను అందుబాటులోకి తెస్తామన్నారు.

సన్‌ మొబిలిటీతో కలిసి.. మొదటి విడతలో భాగంగా చండీగఢ్‌, మొహాలీ, గురుగ్రామ్‌ నగరాల్లో.. ఈ అపే ఈ-సిటీని విడుదల చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి.. దాదాపు 10 నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేసేందుకు వీలుకల్పించే స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

Latest Articles
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
ఇదేందయ్యా ఇదీ.. 200లకుగానూ 212 మార్కులు వేసిన టీచరమ్మ!
ఇదేందయ్యా ఇదీ.. 200లకుగానూ 212 మార్కులు వేసిన టీచరమ్మ!