ఖర్చు పెట్టినా డబ్బులు ఆదా అవ్వాలా? అయితే ఫోన్‌ పే SBI కార్డ్‌ మీ కోసమే..

డిజిటల్ చెల్లింపుల కోసం ఫోన్‌పే SBI కార్డ్‌ను ఫోన్‌పే, SBI కలిసి విడుదల చేశాయి. ఇది ఆన్‌లైన్ కొనుగోళ్లపై 5 వాతం వరకు యూనివర్సల్ క్యాష్‌బ్యాక్, ఫోన్‌పే యాప్‌లో బిల్లు చెల్లింపులపై 10 శాతం వరకు రివార్డులు అందిస్తుంది. UPI లావాదేవీలపై కూడా 1 శాతం రివార్డులు లభిస్తాయి.

ఖర్చు పెట్టినా డబ్బులు ఆదా అవ్వాలా? అయితే ఫోన్‌ పే SBI కార్డ్‌ మీ కోసమే..
Phonepe Sbi Card

Updated on: Apr 16, 2026 | 9:30 AM

డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ కార్డ్‌లు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్‌ పే, SBI కలిసి ఫోన్‌పే ఎస్‌బిఐ కార్డ్‌ను ప్రవేశపెట్టాయి. సులభమైన రివార్డ్స్ సిస్టమ్‌తో, ఆన్‌లైన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్డ్ రూపొందించారు. ఈ కార్డ్ ప్రత్యేకత దాని ‘యూనివర్సల్ రివార్డ్స్’ విధానం. వినియోగదారులు ఏ బ్రాండ్ లేదా కేటగిరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా, ప్రతి ఆన్‌లైన్ లావాదేవీపై నేరుగా 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా, ఫోన్‌ పే యాప్ ద్వారా రీఛార్జీలు, విద్యుత్, నీరు, ఇన్సూరెన్స్ వంటి బిల్లులు చెల్లించినప్పుడు 10 శాతం వరకు రివార్డులు లభిస్తాయి.

ఇప్పటి ట్రెండ్ అయిన UPI చెల్లింపులపైనా ఈ కార్డ్ ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తోంది. ప్రతి UPI లావాదేవీపై 1 శాతం వరకు రివార్డులు అందించడం ద్వారా చిన్న ఖర్చులను కూడా లాభదాయకంగా మార్చేలా రూపొందించారు. ఇతర కార్డ్‌లలో ఉండే క్లిష్టమైన రివార్డ్ పాయింట్ల వ్యవస్థకు భిన్నంగా, ఈ కార్డ్‌లో ప్రతి రివార్డ్ పాయింట్ విలువ రూ.1గా నిర్ణయించారు. వినియోగదారులు కూడబెట్టిన పాయింట్లను నేరుగా తమ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. వోచర్లు లేదా ప్రత్యేక రీడంప్షన్ ప్రక్రియ అవసరం లేకుండా సులభంగా ప్రయోజనం పొందవచ్చు.

ప్రయాణ సౌకర్యాల పరంగా కూడా ఈ కార్డ్ ఆకర్షణీయంగా ఉంది. ప్రయారిటీ పాస్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ వంటి ప్రీమియం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కార్డ్‌ను పొందడం కూడా సులభమే. మొదటి సంవత్సరానికి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా, పూర్తిగా డిజిటల్ విధానంలో ఫోన్‌పే యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us