PhonePe: ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ఫోన్‌పే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్‌పేతో పోటీ పడుతోంది. తాజాగా, ఫోన్‌పే ‘వాలెట్ ఆటో టాప్అప్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. యూపీఐ విధానాన్ని అనుసరించి ఈ కొత్త ఫీచర్‌ను రోలవుట్చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌పే వాలెట్‌ను సులభంగా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఫోన్‌పే వాలెట్లో అమౌంట్ లేనట్లయితే ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతుంది. తద్వారా, ఫోన్‌పే కస్టమర్లు ప్రతిసారీ వారి వాలెట్‌ను మాన్యువల్‌గా లోడ్ చేసే ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాదు ఈ ఆటో టాప్-అప్ ఆప్షన్ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. సుదీర్ఘమైన ప్రాసెల్లేకుండా సులభంగా వాలెట్ లోడ్ చేస్తుంది. కాగా, యూపీఐ ఈ-మ్యాన్‌డేట్ సెటప్ చేసిన తర్వాత, కస్టమర్లు తమ వాలెట్‌ను లోడ్ చేయాలనుకున్న లేదా చెల్లింపులు చేయాలనుకున్న ప్రతిసారీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓటిపి కోసం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. వాలెట్బ్యాలెన్స్ జీరోకు పడిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా రీఛార్జ్చేస్తుంది.
ముందుగా టాప్-అప్ ఐకాన్‌పై క్లిక్చేయండి. అప్పుడు, మీరు వాలెట్‌కు జోడించాల్సిన మొత్తం నమోదు చేసి టాప్‌టాప్ ప్రారంభించండి. ఉదాహరణకు మీరు ఆటో టాప్-అప్ వాలెట్లో రూ .1,000 నుండి 5,000 రూపాయల వరకు లోడ్ చేయాలనుకుంటే.. మీ అమౌంట్‌ను ఎంటర్‌చేసి ‘టాప్-‘ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రీన్ కింద ఉండే ఆటో టాప్-అప్ వాలెట్ ఆప్షన్‌ను అప్ అండ్ సెట్ చేసుకోవాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలి. ఆ తరువాత, మీ ఫోన్‌పే వాలెట్ వెంటనే రీఛార్జ్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని వివిధ రకాల బిల్లులు చెల్లింపులు, రీచార్జ్‌లకు ఉపయోగించుకోవచ్చు.
కాగా, ఈ-మ్యాన్డేట్యూపీఐ ఫీచర్ డిజిటల్పేమెంట్ సిస్టమ్‌లో ముందుంటుందని ఫోన్‌పే తెలిపింది. ఇది డిజిటల్పేమెంట్ సిస్టమ్‌ను మరింతగా ప్రోత్సహిస్తుందని, డిజిటల్పేమెంట్బిజినెస్ రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న ఫోన్ పే మరింత మరింత మంది కస్టమర్లను చేర్చుకోగలదని తెలిపింది. అలాగే ఈ ఆటోపేమెంట్ ఫెయిల్యూర్అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మిగతా మాన్యువల్ పేమెంట్లతో పోలిస్తే ఇవి 99.99 శాతం సక్సెస్ రేటు కలిగి ఉంటాయని తెలిపింది. ఫోన్ పే ద్వారా మీ మొబైల్రీఛార్జ్, కరెంట్బిల్లు, డిష్ రీచార్జ్, ఇన్సూరెన్స్ రెన్యువల్ వంటి ఇతర చెల్లింపుల సేవలు ఎన్నో ఉన్నాయి. కస్టమర్లకు మరిన్ని సులభమైన సేవలు అందించేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోన్ పే తెలిపింది.