Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ రిలీఫ్‌.. ఏపీలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణలో మాత్రం..

|

Sep 16, 2021 | 8:52 AM

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు కనిపించాయి.  అయితే మెట్రో నగరాల్లో ధరలు నిలకడగా ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశీయ చమురు కంపెనీలు...

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ రిలీఫ్‌.. ఏపీలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణలో మాత్రం..
Petrol
Follow us on

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు కనిపించాయి.  అయితే మెట్రో నగరాల్లో ధరలు నిలకడగా ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచలేదు. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.43గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.84గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.49గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.73గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.49 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.42 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.43 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.47లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.53గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.50గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.49 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.42లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.04 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.78గా ఉంది.

ఇవి కూడా చదవండి: Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..