Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా ప్రాంతాల్లో తగ్గుతుండగా.. మరికొన్ని చోట్ల పెరుగుతోంది. ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల్లో భారీ ప్రభావం కనిపించకున్నా.. కొన్ని నగరాల్లో స్థిరంగా ఉండగా.. మరికొన్ని చోట్ల కొద్దిగా పెరిగాయి.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.09గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.84గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.22గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.23కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.31లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.57 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.66గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.71లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.72గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.87గా ఉండగా.. డీజిల్ ధర రూ.96గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.23 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.31లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.
ఇవి కూడా చదవండి: AP Panchayat Elections Live: ఏపీలో మినీ పల్లె పోరు.. కోవిడ్ జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు..
Rs 10 Thousand Notes: మళ్లీ రూ.10 వేల నోట్లు ముద్రిస్తున్నారా.. ఆసక్తికర విషయాలు మీ కోసం..