Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రో ధరలు.. ఏపీలో సెంచరీ దాటేసిన డీజిల్ ..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. అయితే మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా  ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రో ధరలు.. ఏపీలో సెంచరీ దాటేసిన డీజిల్ ..
Petrol Diesel Prices

Updated on: Oct 04, 2021 | 8:56 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. అయితే మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా  ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఏపీలో మాత్రం డీజిల్ ధర సెంచరీని దాటి పురుగులు పెడుతోంది. సోమవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.51గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 99.04గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.92గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.60గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.78గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.62గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.10గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107 ఉండగా.. డీజిల్ ధర రూ.99.50గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.21 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.75గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.87 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.83 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.108.48 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.42గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.100.90గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.97గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.87 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.83లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 102.39 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.77 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.43కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.48గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.07 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.87 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 100.01 ఉండగా.. డీజిల్ ధర రూ.95.31గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.95 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.96.34గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.23 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.96గా ఉంది.

ఇవి కూడా చదవండి: Consumer Right: మీరు తినే ఐస్ క్రీం ప్రమాదకారి కావొచ్చు.. తెలుసా..? ఆ కోడ్ లేకపోతే నకిలీదే..

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగకు జేబీఎస్ నుంచి జిల్లాలకు అతి తక్కువ ధరలో ఓల్వో బస్సు సర్వీసులు

Loading...
Unable to load recommendations.
Follow Us