Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్మం ధరలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో వాహనదారులకు భారంగా మారుతోంది. ఒక వైపు నిత్యవసర సరుకుల ధరలు, వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటం, మరో వైపు ఇంధర ధరలు పెరుగుతుండటం సామాన్యుడికి నడ్డి విరుచేలా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఎంత మొరపెట్టుకున్నా.. ధరల పెరుగుదలకు ఏ మాత్రం బ్రేకులు పడటం లేదు. ఇప్పటికే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110కి దాటిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ , డీజిల్ కరోనా కాలంలో అమాంతం పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై రూ.25 పైసల నుంచి 38 పైసల వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.14 చేరుకుంది. ఇక డీజిల్ ధర రూ.93కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.12 ఉండగా, డీజిల్ ధర రూ. 100.66 ఉంది. కోల్‌కతాలో 104.80 ఉండగా, డీజిల్ ధర రూ.95.93వద్ద ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.53 ఉండగా, డీజిల్ ధర రూ.97.26కు చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107.77 ఉండగా, డీజిల్ ధర రూ.98.52కు చేరింది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.39 ఉండగా, డీజిల్ ధర రూ. 102.74కు చేరింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.24 ఉండగా, డీజిల్ ధర రూ.102.57 ఉంది. ఇక విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.76 ఉండగా, డీజిల్ ధర రూ.103.05వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.33 ఉండగా, డీజిల్ ధర రూ. 101.27కు చేరింది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.21 ఉండగా, డీజిల్ ధర రూ.101.15 ఉంది. ఇక వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.02 ఉండగా, డీజిల్ ధర రూ.100.81కు చేరింది.