
ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్ లేనివారంటూ ఎవరూ కనిపించడం లేదు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అనే సంబంధం లేకుండా సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రతీఒక్కరూ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. అంతలా క్రెడిట్ కార్డ్ వినియోగం అనేది పెరిగిపోయింది. బ్యాంకులు కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు క్రెడిట్ కార్డులను తెగ జారీ చేస్తున్నాయి. కస్టమర్లకు ఫోన్ చేసి మరీ క్రెడిట్ కార్డు తీసుకుంటే అనేక డిస్కౌంట్స్ ఇస్తామంటూ ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ ఆఫర్లకు ఆశపడి క్రెడిట్ కార్డు తీసుకునేవారు కూడా ఉన్నారు. అయితే క్రెడిట్ కార్డువాడేవారు చాలామంది బిల్లు కట్టలేక.. ఆ బిల్లును ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటారు. ఇలా మార్చుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి..? బిల్లును ఈఎంఐ రూపంలో కి మార్చుకోవడం వల్ల సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా అనే విషయాలు చూద్దాం.
బిల్లును ఈఎంఐగా మార్చుకున్నప్పుడు.. టైమ్ ప్రకారం ఈఎంఐ చెల్లించాలి. ఇలాంటి సమయంలో మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అంతేకాకుండా క్రెడిట్ యుటిలైజేషసన్ రేషియా పెరగకుండా చూసుకోవాలి. ఈ రేషియా 30 శాతంగా ఉంటుంది. దీనిని మించి మీరు ఖర్చు చేస్తే సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఇక మీరు ఈఎంఐగా మార్చుకోవడం వల్ల బిల్లు చెల్లించాల్సిన సమయం కూడా పెరుగుతుంది.
బిల్లును ఈఎంఐ రూపంలోకి మార్చుకున్నందుకు ప్రాజెసింగ్ ఫీజ్, జీఎస్టీతో పాటు ఇతర ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఛార్జీలను మీ క్రెడిట్ కార్డు నుంచే బ్యాంకులు తీసుకుంటాయి. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే లేట్ ఫీజులు భారీగా ఉంటాయి. వీటిని గమనించుకుని క్రెడిట్ కార్డ్ బిల్లును ఈఎంఐ రూపంలోకి మార్చుకోవాలి. అవగాహన లేకుండా మార్చుకుంటే మీకే నష్టం జరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..