Savings Account: ఇంత కంటే ఎక్కువ డబ్బు సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోకండి.. మీకే నష్టం.. ఎవ్వరికీ తెలియని విషయమిదే..

మనలో అందరూ సేవింగ్స్ అకౌంట్ వాడుతూ ఉంటారు. ఈ అకౌంట్ గురించి తెలియనవారంటూ ఎవరూ ఉండరు. ఇండియాలో ఎక్కువమంది వాడుతున్న అకౌంట్ ఇదే. అయితే సేవింగ్స్ అకౌంట్‌లో ఎంతవరకు డబ్బులు ఉంచుకుంటే మంచిది.. సేవింగ్స్ అకౌంట్‌కు ప్రత్యామ్నాయంగా రాబడి పొందటానికి బెస్ట్ ఆప్షన్లు ఏంటి? అనేది చూద్దాం.

Savings Account: ఇంత కంటే ఎక్కువ డబ్బు సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుకోకండి.. మీకే నష్టం.. ఎవ్వరికీ తెలియని విషయమిదే..
Savings Account

Updated on: Dec 12, 2025 | 9:19 PM

Bank Account: ఇండియాలో ప్రతీఒక్కరికీ సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది. డబ్బులు పొదుపు చేసుకోవడాని కంటే రోజువారీ ఖర్చులు, భద్రత కోసం ఈ అకౌంట్ తీసుకుంటూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోనే అవకాశం ఉంది. దీని వల్ల సేవింగ్స్ అకౌంట్‌ను అందరూ తీసుకుంటారు. పొదుపు కోసం మీరు సేవింగ్స్ అకౌంట్ వాడితే తక్కువ వడ్డీనే లభిస్తుంది. కేవలం 2.5 నుంచి 3 శాతం వరకే వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీని వల్ల పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకోవడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది.

సేవింగ్స్ అకౌంట్ కంటే..

మీరు రూ.2 లక్షల కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్‌లో పొదుపు చేసుకోకపోవడం మంచిది. దానికి బదులుగా మీరు ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెడితే లాభం జరుగుతుంది. సేవింగ్స్ అకౌంట్లలో వచ్చే వడ్డీ కంటే అధిక రాబడి మీరు పొందోచ్చు. సేవింగ్స్ అకౌంట్‌లో కంటే మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లు, ఫిక్స్ డ్ డిపాజిట్లలో దాచుకోండి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే..

సేవింగ్స్ అకౌంట్స్‌కు బదులు మ్యూచువల్ ఫండ్స్‌లో లక్ష రూపాయలు 5 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే 12 శాతం వడ్డీ రావొచ్చు. అంటే మీరు రాబడి రూ.76,234 పొందే అవకాశముంటుంది. అంటే మొత్తం కలిపి మీకు మెచ్యూరిటీ అమౌంట్ రూ.1.76 లక్షలు వస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే..

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో లక్ష రూపాయలు 5 సంవత్సరాల కాల వ్యవధితో 7 శాతం వడ్డీతో పెడితే మీకు రాబడి రూ.40,255 వస్తుంది. అంటే మొత్తం రూ.1.4 లక్షలు వస్తుంది.  ఇక ఎక్కువకాలం  ఉంచితే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ లాభం పొందగలుగుతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌కు అనుగుణంగా రాబడి వస్తుంది. అందుకే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వేరే సిప్‌కు పెట్టుబడి మార్చుకోండి. సేవింగ్స్ అకౌంట్ జస్ట్ రోజువారీ ఖర్చులు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంచుకోండి.