
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా, యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నా.. ఖాతాలో డబ్బులు లేకపోతే అవి కేవలం బొమ్మల్లాగే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆ కష్టాలకు కాలం చెల్లింది. మీ బ్యాంక్ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా సరే, మీరు దర్జాగా యూపీఐ ద్వారా స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. అవును, ఇది నిజం! ఆర్బీఐ మరియు ఎన్పీసీఐ సంయుక్తంగా తీసుకువచ్చిన ఒక సరికొత్త విప్లవాత్మక మార్పు వల్ల ఇప్పుడు ఇది సాధ్యమవుతోంది. అసలు అకౌంట్లో డబ్బులు లేకున్నా పేమెంట్ ఎలా జరుగుతుంది? ఈ సౌకర్యాన్ని మీరు ఎలా పొందాలి?
చాలా బ్యాంకులు ఇప్పుడు తమ వినియోగదారులకు ‘పే లేటర్’ అనే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇది ఒక రకమైన డిజిటల్ క్రెడిట్ కార్డులా పనిచేస్తుంది. మీరు గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం వంటి యాప్స్ వాడుతున్నప్పుడు.. మీ బ్యాంక్ మీకు కొంత పరిమితి వరకు అప్పును మంజూరు చేస్తుంది. ఉదాహరణకు మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా, ఈ పే లేటర్ ఆప్షన్ ద్వారా మీరు షాపింగ్ చేయవచ్చు లేదా బిల్లులు చెల్లించవచ్చు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఆ డబ్బును బ్యాంక్ కు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
ఇది ఇటీవల అందుబాటులోకి వచ్చిన మరొక అద్భుతమైన ఫీచర్. దీని ద్వారా బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల హిస్టరీని బట్టి కొంత క్రెడిట్ లైన్ (అప్పుగా ఇచ్చే మొత్తం) కేటాయిస్తాయి.
ఈ సౌకర్యం ఎంతో ఉపయుక్తంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు బాధ్యతాయుతంగా ఉండాలి. ఇది బ్యాంక్ ఇచ్చే అప్పు అని గుర్తుంచుకోవాలి. నిర్ణీత గడువు లోగా చెల్లించకపోతే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉంది. అలాగే ఇది మీ సిబిల్ (CIBIL) స్కోర్ పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ, సకాలంలో రీపేమెంట్ చేయడం చాలా ముఖ్యం. యూపీఐ ఇప్పుడు కేవలం మన అకౌంట్లోని డబ్బును పంపడానికే కాదు, కష్టకాలంలో మనకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలవడానికి కూడా సిద్ధమైంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల నగదు కొరత అనే సమస్యకు దాదాపు చెక్ పడినట్టే.