
Gas Tricks: ఏ ఇంట్లో అయినా గ్యాస్ సిలిండర్ అనేది అత్యంత ముఖ్యం. వంటింట్లో ఎప్పుడూ ఉండాల్సిన వస్తువు ఇదే. గ్యాస్ సిలిండర్ లేకపోతే వంటింట్లో ఏ పని జరగదు. ఏది వండుకోవాలన్నా అది ఉండాల్సిందే. ప్రతీ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లను ఉంచుకుంటారు. ఎందుకంటే ఒకటి మధ్యలో అయిపోతే వెంటనే పెట్టుకోవడానికి రెండో గ్యాస్ సిలిండర్‌ను సిద్దంగా ఉంచుకుంటారు. సాధారణంగా ఒక గ్యాస్ సిలిండర్ 3 నెలల వరకు వస్తుంది. కుటుంబసభ్యులు ఎక్కువగా ఉన్నా లేదా పండుగలు ఎక్కువగా ఉంటే రెండు నెలలకే ఖాళీ అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వాడుకోవచ్చు.
వంట త్వరగా కంప్లీట్ అవుతుందనే కారణంతో చాలామంది హై ఫ్లేమ్‌లో ఉంచుతారు. కానీ దీని వల్ల అనవసరంగా ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. దీని వల్ల గ్యాస్ త్వరగా ఖాళీ అవుతుంది. అలా కాకుండా స్టవ్‌పై గిన్నె పెట్టినప్పుడు కింద భాగంలో ఎంతరవరకు మంట ఉండాలో అంతవరకే ఉండేలా చూసుకోవాలి. స్థాయికి మంచి మంట పెడితే గ్యాస్ అదనంగా ఖర్చు కావొచ్చు.
ఇక వంట చేసేటప్పుడు ఆ పదార్థానికి ఎంత వాటర్ అవసరమో.. అంతే ఉపయోగించాలి. అనవసరంగా ఎక్కువ వాటర్ వాడితే అవి మరగడానికి ఎక్కువ టైమ్ పట్టవచ్చు. దాని వల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చై గ్యాస్ త్వరగా అయిపోతుంది. అందుకే ఎంత వాటర్ అవసరమో.. అంతే ఉపయోగించాలి.
ఇక గ్యాస్ స్టవ్‌పై పాత్రలు పెట్టినప్పుడు అవి తడి లేకుండా చూసుకోవాలి. తడి పాత్రలు ఉపయోగిస్తే అవి ఆవిరి కావడానికి ఎక్కువ గ్యాస్ అవసరమవుతుంది. అందుకే తడి పూర్తిగా ఆరిన గిన్నెలను మాత్రమే ఉపయోగించాలి. దీని వల్ల కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చు.ఇక స్టవ్ బర్నర్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లోపల దుమ్ము,ధూళి ఉండటం వల్ల మంట బయటకు సరిగ్గా రాదు. బర్నర్ శుభ్రంగా ఉంటే మంట నీలం రంగులో వస్తుంది. లేకపోతే ఎరుపు,పసుపు, నారింజ రంగులో వస్తే బర్నర్‌లో సమస్య ఉన్నట్లు లెక్క. అప్పుడు బర్నర్‌ను క్లీన్ చేసుకోవడం లేదా రీపేర్‌కు ఇవ్వడం చేయాలి.