Shopping Tips: డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. ఈ పనులు చేస్తే వద్దన్నా మీ డబ్బులు ఆదా అవుతాయి

డీమార్ట్‌కు షాపింగ్ కోసం వెళుతున్నారా..? అయితే మీ కోసమే ఈ చిట్కాలు.. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీ డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఎలా పడితే అలా కొనకుండా నియంత్రణ చేసుకోవచ్చు. డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలో చూడండి.

Shopping Tips: డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. ఈ పనులు చేస్తే వద్దన్నా మీ డబ్బులు ఆదా అవుతాయి
Dmart

Updated on: Dec 01, 2025 | 8:10 AM

Dmart: ఇంట్లోకి ఏమైనా నిత్యావసరాల సరుకులు కావాలన్నా లేదో ఇంట్లోకి కావాల్సిన పరికరాలు ఏమైనా అవసరమైనా వెంటనే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు డీమార్ట్. తక్కువ ధరకే హోల్‌సేల్ ధరల్లో వస్తువులు లభిస్తాయనే కారణంతో అక్కడికే వెళతారు. నెలకు కావాల్సిన సరుకులను ఒకేసారి వెళ్లి తెచ్చుకుంటారు. సిటీలు, పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు విరివిగా డీమార్ట్‌లు వెరిశాయి. బయట రిటైల్ షాపుల్లో సరుకులు కొనాలంటే ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే డీమార్ట్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, భారీ తగ్గింపు లాంటి ఆఫర్లతో డీమార్ట్ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటుంది. అక్కడి ఆఫర్లు చూసి ఆకర్షితులై అవసరం లేనివి కూడా కొంటారు. మనలో డీమార్ట్‌కు ప్రతీఒక్కరూ ఒకసారైనా వెళ్లి ఉంటారు. డీమార్ట్‌లో తక్కువకి వస్తున్నాయని ఏవి పడితే అవి కొనకూడదు. కొన్ని టెక్నిక్స్‌తో షాపింగ్ చేయాలి. అదెలాగంటే..

పండుగ వేళ చేయండి

పండుగల వేళ డీమార్ట్‌లో అన్ని వస్తువులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. బై వన్.. గెట్ వన్ అనే ఆఫర్లతో పాటు భారీ తగ్గింపులు కూడా ఇస్తారు. దసరా, న్యూఇయర్, సంక్రాంతి, క్రిస్మస్ లాంటి పండుగల సమయంలో షాపింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకులు కొనవచ్చు. ఇంట్లో సరుకుల బడ్జెట్ తగ్గించుకోవాలనుకునేవారు ప్రత్యేక ఆఫర్ల సమయంలో షాపింగ్‌కు వెళ్లండి.

ఎక్కువ టైమ్ కేటాయించండి

ఇక బిజీ లైఫ్‌లో చాలామంది హడావుడిగా వచ్చి స్పీడ్‌గా అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి వెళ్తుంటారు. ఆఫర్లు, డిస్కౌంట్స్ గురించి పట్టించుకోరు. కనీసం ఒక గంట అయినా షాపింగ్‌కు కేటాయించాలి. ఒకసారి మాల్ మొత్తం తిరిగి చూడాలి. ఏవి తక్కువకి వస్తున్నాయి.. వేటిపై ఆఫర్లు ఉన్నాయనేది ఒకసారి చెక్ చేయాలి. తక్కువకి వస్తుంటేనే కొనుగోలు చేయాలి. దీని వల్ల మీ బిల్లులను వీలైనంతంగా తగ్గించుకోవచ్చు. అలా కాకుండా ఫాస్ట్ ఫాస్ట్‌గా చేస్తే మీకే నష్టం జరుగుతుంది.

తొలి వారంలో వెళ్లకపోవడం బెటర్

ప్రతీ నెలా తొలి వీక్‌లో డీమార్ట్‌కు వెళ్లకపోవడమే మంచిది. ఉద్యోగులకు తొలివారంలో జీతాలు పడతాయి గనుక అక్కడికి వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఒకేసారి కొంటారు. దీని వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీరు సరిగ్గా షాపింగ్ చేయలేరు. అందువల్ల తొలివారం తర్వాత వెళితే కాస్త సౌకర్యవంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. అదీ మధ్యాహ్నం సమయంలో షాపింగ్‌కు వెళ్తే రద్దీ తక్కువగా ఉంటుంది.