EMI, అప్పుల బాధలు ఎక్కువయ్యాయా? ఈ సింపుల్‌ ప్లాన్‌తో 2027లో అప్పులన్నీ తీర్చేస్తారు

ఆదాయం వస్తుంది, కానీ నెల ముగిసేసరికి అప్పుల కంతులు (EMIs) కట్టడానికే జీతం సరిపోవడం లేదా? ఇది నేటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మధ్యతరగతి జీవుల ప్రధాన సమస్య. సంపాదన బాగున్నా, నిరంతరం అప్పుల ఒత్తిడిలో బతుకుతున్న ఓ వ్యక్తికి చాట్ జీపీటీ (ChatGPT) అందించిన ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సంవత్సరానికి రూ.15 లక్షల ఆదాయం ఉన్నా, వ్యక్తిగత రుణాలు, కారు ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులతో సతమతమవుతున్న వారికి ఈ ప్లాన్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.

EMI, అప్పుల బాధలు ఎక్కువయ్యాయా? ఈ సింపుల్‌ ప్లాన్‌తో 2027లో అప్పులన్నీ తీర్చేస్తారు
Debt Free Freedom.jpg

Updated on: Jun 18, 2026 | 8:20 PM

సంపాదన పెరుగుతున్నా అప్పుల ఈఎంఐలతో సతమతమవుతున్నారా? ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడి 2027 నాటికి పూర్తిస్థాయిలో డెట్ ఫ్రీ కావాలని ఉందా? మీ ఆదాయాన్ని, ఖర్చులను సరైన ప్రణాళికతో ఎలా నిర్వహించుకోవాలో, అప్పులను చిటికెలో ఎలా తీర్చుకోవాలో తెలిపే అద్భుతమైన ఆర్థిక వ్యూహాలు ఏంటో తెలుసుకుందాం..

అసలు సమస్య ఎక్కడ ఉంది?

సదరు వ్యక్తి నెలకు రూ.53,000 ఈఎంఐల రూపంలోనే కడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలకు మరో రూ. 45,000 ఖర్చవుతున్నాయి. చాట్ జీపీటీ విశ్లేషణ ప్రకారం, అప్పులు ఎక్కువగా ఉండటం కంటే, భవిష్యత్ ఆదాయాన్ని ముందే ఖర్చు చేసేయడం అసలు సమస్య. ముఖ్యంగా ప్రయాణాలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఈఎంఐలుగా మార్చుకోవడం, తెలియకుండానే ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోంది.

చాట్ జీపీటీ సూచించిన 3 మార్గాలు

  1. సాధారణ వ్యూహం : జీవనశైలి మార్చుకోకుండా యథావిధిగా కొనసాగిస్తే, 2030 వరకు అప్పులు తీరవు. ఇది సురక్షితమే కానీ, ఒత్తిడి తగ్గదు.
  2.  మధ్యస్థ వ్యూహం : అనవసర సబ్‌స్క్రిప్షన్లు, విలాస ఖర్చులు తగ్గించుకుని, ఆ డబ్బును అప్పులు తీర్చడానికి వాడితే, 2028 మధ్యలో అప్పుల నుంచి బయటపడొచ్చు.
  3. అగ్రెసివ్ వ్యూహం (లక్ష్యం 2027): మీ దగ్గర ఉన్న స్టాక్ మార్కెట్ పెట్టుబడులలో రూ. 4 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు విక్రయించి, ఆ మొత్తంతో అధిక వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లను ముందుగా ముగించేయాలి.

ముఖ్యమైన సూచనలు

చాట్ జీపీటీ చెప్పిన ప్రకారం, పర్సనల్ లోన్‌పై వడ్డీ ఎక్కువ కాబట్టి, దీన్ని ముందుగా తీర్చడం చాలా ముఖ్యం. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ జోలికి వెళ్లకుండా, కేవలం పెట్టుబడుల ద్వారా నిధులను సమీకరించాలి. భవిష్యత్తులో ప్రయాణాలకు, ఇన్సూరెన్స్ కోసం ఈఎంఐల జోలికి వెళ్లకుండా, ప్రత్యేకంగా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.

అగ్రెసివ్ ప్లాన్ ఫాలో అయితే.. 2026 అక్టోబర్ నాటికి క్రెడిట్ కార్డ్ బిల్లులు, 2027 సెప్టెంబర్ నాటికి పర్సనల్ లోన్, డిసెంబర్ నాటికి కారు లోన్ క్లియర్ అయిపోతాయి. మీరు కూడా అప్పుల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండాలనుకుంటే, ఈ వ్యూహాన్ని పరిశీలించవచ్చు. మరి, మీ అప్పులను తీర్చుకోవడానికి మీరు సిద్ధమేనా?

Follow Us