Passenger Vehicle: దేశంలోని తొలిసారిగా.. ఒక నెలలోనే రికార్డు సృష్టించిన వాహనాల అమ్మకాలు!

Passenger Vehicle: ఇక్కడ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సొల్యూషన్ ప్రొవైడర్ వెర్టెలోతో చేతులు కలిపింది. టాటా మోటార్స్ అన్ని ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన విభాగాలలో అద్దె సేవల కోసం రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది..

Passenger Vehicle: దేశంలోని తొలిసారిగా.. ఒక నెలలోనే రికార్డు సృష్టించిన వాహనాల అమ్మకాలు!

Updated on: May 15, 2025 | 6:03 PM

Passenger Vehicle: దేశంలో ప్రయాణికుల వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 4 శాతం పెరిగి 3,48,847 యూనిట్లకు చేరుకున్నాయి. పరిశ్రమల సంస్థ SIAM గురువారం విడుదల చేసిన తాజా డేటాలో వెల్లడైంది. ఏప్రిల్ 2024లో ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 3,35,629 యూనిట్లుగా ఉన్నాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. ప్యాసింజర్ వాహన విభాగం ఏప్రిల్ 2025లో ఇప్పటివరకు అత్యధికంగా 3.49 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందని, ఇది ఏప్రిల్ 2024తో పోలిస్తే 3.9 శాతం ఎక్కువని చెప్పారు.

SIAM విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఏప్రిల్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 17 శాతం తగ్గి 14,58,784 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 2024లో బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్‌ల హోల్‌సేల్ అమ్మకాలు 17,51,393 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో స్కూటర్ అమ్మకాలు 5,48,370 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏప్రిల్ 2024లో 5,81,277 యూనిట్ల నుండి ఆరు శాతం తగ్గింది. మోటార్‌సైకిల్ అమ్మకాలు ఏప్రిల్‌లో వార్షిక ప్రాతిపదికన 23 శాతం తగ్గి 8,71,666 యూనిట్లకు చేరుకున్నాయి. మోపెడ్‌ల హోల్‌సేల్ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంలో 41,924 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది శాతం తగ్గి 38,748 యూనిట్లకు చేరుకున్నాయి.

ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ (OBD) 2 నిబంధనల రెండవ దశ కోసం ఆటోమోటివ్ పరిశ్రమ ఏప్రిల్ 2025 నుండి కొత్త నియంత్రణ విధానానికి మారడం ప్రారంభించిందని మీనన్ చెప్పారు. దీనితో పాటు ఈ నెల నుండి దేశవ్యాప్తంగా E-20 పెట్రోల్ వాహనాలు కూడా ప్రవేశపెట్టాయి. E-20 పెట్రోల్ వాహనాలు అనేవి E-20 ఇంధనాన్ని (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం) ఉపయోగించగల పెట్రోల్ వాహనాలు.

ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు:

ఇక్కడ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సొల్యూషన్ ప్రొవైడర్ వెర్టెలోతో చేతులు కలిపింది. టాటా మోటార్స్ అన్ని ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన విభాగాలలో అద్దె సేవల కోసం రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలకు విద్యుత్ రవాణాను అందుబాటులోకి తీసుకురావడంలో వెర్టెలోతో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అడుగు అని టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కౌల్ అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి