వేసవిలో దంచికొడుతోన్న ఎండలకు.. జనాలు తట్టుకోలేకపోతున్నారు. విపరీతమైన వేడి, ఉక్కపోతకు తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుండటంతో.. అందరూ ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వీటి వినియోగంతో కరెంట్ బిల్లు కూడా తడిసిమోపెడవుతుంది. మరి సామాన్యులు ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. దానికోసమే వారికీ ఆల్టర్నేట్‌గా మార్కెట్‌లోకి పోర్టబుల్ ఏసీలు, మినీ ఎయిర్ కూలర్లు వచ్చేశాయి. వీటితో ఇల్లంతటిని చల్లబరుస్తుంది. ఈ లిస్టులో నుంచి ఓ అదిరిపోయే ఐటెంను మీ ముందుకు తీసుకొచ్చేశాం. ఇల్లంతటిని చల్లబరిచే ఫ్యాన్.. ఇదేం పెద్దది కాదు.. సైజ్‌లో చిన్నదే.. అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరి ధర ఎంతో తెలిస్తే అస్సలు మీరు కొనకుండా ఉండలేరు.
ఈ పోర్టబుల్ మినీ ఎయిర్ కూలింగ్ ఫ్యాన్‌ను మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. బెడ్ రూమ్, డైనింగ్ హాల్, వర్క్ స్పేస్.. అలాగే మీ ఆఫీస్‌లో, పిక్నిక్‌కి వెళ్లేటప్పుడు కూడా దీన్ని ఈజీగా తీసుకెళ్లవచ్చు. దీనిలోని ఫ్యాన్ స్పీడ్‌ను 3 స్పీడ్ కంట్రోల్స్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఇది గది అంతటిని చిటికెలో చల్లబరుస్తుంది. ఎలాంటి నీరు అవసరం లేకుండానే ఇది చల్లటి గాలిని ఇస్తుంది. దీనిలోని ఆసిలేటింగ్ ఫీచర్.. గది మూలాలకు గాలిని వీచేలా చేస్తుంది. తక్కువ కరెంట్‌ను వినియోగిస్తుంది. కేవలం 90 వాట్ల కరెంట్ దీని వినియోగానికి ఉపయోగపడుతుంది. కాగా, దీని వాస్తవ ధర రూ. 3 వేలు కాగా.. 50 శాతం తగ్గింపుతో రూ. 1509కే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.(Source)