భారత దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఓలా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. మామూలు స్కూటర్లలా డబ్బులు ఇచ్చిన వెంటనే స్కూటర్ డెలివరీ చేసే పరిస్థితులు ఓలా విషయంలో లేవు. మనకు ఓలా స్కూటర్ కావాలంటే ముందుగా ప్రీ బుక్ చేసుకోవాలి. నిర్ణీత సమయం వేచి చూసిన తర్వాతే మనకు స్కూటర్ డెలివరీ ఇస్తారు. అయితే ఇంత డిమాండ్ ఉన్న స్కూటర్‌లో ఓ కొత్త కలర్ వేరియంట్ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగే కదా.. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొత్త మోడల్ సొంతం చేసుకునేందుకు చాలామంది ముందుకు వస్తారు. హోలీ సందర్భంగా ఇటీవల ఓలా కంపెనీ తన స్కూటర్‌లో కొత్త వేరియంట్ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్‌లో తెలిపారు. అయితే ఓలా అభిమానులకు గుడ్ న్యూస్‌తో పాటు లాస్ట్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈ స్కూటర్‌ను ఎంత ఖర్చు చేసినా కొనలేరని ట్విస్ ఇచ్చారు. కేవలం పరిమిత సంఖ్య అంటే ఐదు స్కూటర్లనే రిలీజ్ చేస్తున్నామని వివరించారు.
ఓలా స్కూటర్ కొన్న వినియోగదారులు హోలీ తమ ఓలా స్కూటర్‌తో కలిపి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుపుతూ తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తే ఐదు ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి వారికి కొత్త ఎడిషన్ స్కూటర్‌ను గిఫ్ట్‌గా ఇస్తామని పేర్కొన్నారు. ఫొటో మాత్రమే కాదు వీడియో షేర్ చేసినా ఉత్తమ ఎంపికకు అర్హులేనని వివరించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓలా స్కూటర్‌తో జరుపుకున్న మధురమైన హోలీ స్మృతులను హ్యాపీగా ట్విట్టర్‌లో ఓలా ఖాతాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..