Ola: కీలక నిర్ణయం తీసుకున్న ఓలా.. రూ. 100 కోట్లు ఆదా..

అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఓలా ప్రత్యేక లొకేషన్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను స్వయంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్ స్వయంగా తెలిపారు. గూగుల్‌ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ. 100 కోట్ల వరకు ఆదా అవుతోందని భవిష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు...

Ola: కీలక నిర్ణయం తీసుకున్న ఓలా.. రూ. 100 కోట్లు ఆదా..
Ola
Follow us

|

Updated on: Jul 06, 2024 | 5:40 PM

ఓలా క్యాబ్‌ ఎక్కగానే డ్రైవర్‌లో ఫోన్‌లో మ్యాప్స్‌ కనిపిస్తుంది. మనం ఎంచుకున్న లొకేషన్‌ను ఆ మ్యాప్‌ ఆధారంగానే డ్రైవర్‌ మన గమ్య స్థానానికి చేర్చుతారు. ఇందుకోసం ఓలా గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఇందుకోసం ఓలా గూగుల్‌కు ఏడాదికి అక్షరాల రూ. 100 కోట్లు చెల్లిస్తుందని మీకు తెలుసా.? ఇకపై ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓలా క్యాబ్స్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించబోమని తెలిపింది.

అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఓలా ప్రత్యేక లొకేషన్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను స్వయంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్ స్వయంగా తెలిపారు. గూగుల్‌ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ. 100 కోట్ల వరకు ఆదా అవుతోందని భవిష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఓలా క్లౌడ్‌ సర్వీస్‌లను గతంలో మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ను నిర్వహించేంది. అయితే ఇటీవల మైక్రోసాఫ్ట్‌తో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. దీని స్థానంలో ఓలా ‘ఏఐ క్లౌడ్‌’ సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మ్యాప్స్‌ సేవలను అందిస్తున్నాయి. ఇందులో స్ట్రీట్ వ్యూ, డ్రోన్ మ్యాప్స్, 3d మ్యాప్ లాంటి అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయి.  అతి త్వరలో ఇందుకు సంబంధించిన అప్డేట్లు కూడా వస్తాయని ఆయన తెలిపారు.

భవిష్ అగర్వాల్ ట్వీట్..

ఇదిలా ఉంటే కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే యూజర్లు తమ ఓలా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్‌లో స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ చిత్రాలు, డ్రోన్ మ్యాప్‌లు, 3డీ మ్యాప్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరి ఈ సేవలు కేవలం క్యాబ్స్ కి మాత్రమే పరిమితమవుతాయా.? రెగ్యులర్ గూగుల్ మ్యాప్స్ లాగా ఉపయోగపడుతాయా అన్నది చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..