
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ల వద్ద వాహనదారులకు షాకిచ్చేలా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. ఇక నుంచి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజును నగదు రూపేణా చెల్లించడానికి కుదరదు. అంటే లిక్విడ్ క్యాష్ రూపంలో టోల్ ఛార్జీలు చెల్లించడం ఇక వీలు కాదు. కేవలం ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో టోల్ ఫీజులను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం అమలు చేయనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనిని వర్తింపచేయనున్నట్లు మోదీ సర్కార్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎన్‌హెచ్ఏఐ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొంది.
ఇప్పటివరకు నగదు రూపంలో టోల్ చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉండేవి. ఫాస్టాగ్ చెల్లింపులకు ప్రత్యేక లైన్లు, నగదు రూపంలో కట్టేవారికి అదనంగా కొన్ని లైన్లు ఉండేవి. కానీ ఇక నుంచి ఈ అదనపు లైన్లు ఉండవ్. కేవలం ఫాస్టాగ్ లైన్లు మాత్రమే ఉంటాయి. ఇక నుంచి నగదు రూపంలో టోల్ రుసుం చెల్లించడం వీలు కాదని, పూర్తిగా డిజిటల్ విధానంలోనే కట్టాల్సి ఉంటుందని ఎన్‌హెచ్ఏఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో వాహనదారులు దీనిని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. లేకపోతే టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది.
“టోలింగ్ ఎక్స్‌పీరియన్స్ దిశగా అడుగులు పడ్డాయి. నేషనల్ హైవేస్ ఫీజు ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్యాష్ పేమెంట్స్ సర్వీసులను డిస్‌కంటిన్యూ చేస్తున్నాం. ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 1,150కిపైగా టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించడం, లేన్ల ద్వారా వాహన రాకపోకలను మెరుగుపర్చడం, వేగవంతమైన టోల్ చెల్లింపులను స్వీకరించడం దీని ఉద్దేశం. 98 శాతంకిపైగా ఫాస్టాగ్ వినియోగం, డిజిటల్ చెల్లింపు ఎంపికలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. టోల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది” అని ఎన్‌హెచ్‌ఏఐ ఎక్స్‌లో పేర్కొంది. కాగా ఇప్పటివరకు క్యాష్ రూపంలో టోల్ ఫీజు చెల్లించేవారి నుంచి అదనపు ఛార్జిలు వసూలు చేస్తున్నారు. ఇప్పటినుంచి అసలు ఆ విధానమే బంద్ కానుంది. దీంతో ఇక నుంచి టోల్ చెల్లించాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే. లేకపోతే యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
Towards a Fully Digital Tolling Experience on National Highways!
Cash payments at National Highway fee plazas are likely to be discontinued from 01 April 2026, with toll transactions to be carried out exclusively through @fastagofficial and @UPI_NPCI.
This transition aims to… pic.twitter.com/ShIgaRt2ZN
— NHAI (@NHAI_Official) March 23, 2026