స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు!

| Edited By:

Jul 29, 2019 | 4:59 PM

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 196 పాయింట్లు నష్టపోయి 37,686 వద్ద, నిఫ్టీ 95పాయింట్లు నష్టపోయి 11,189 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటామోటార్స్‌, వేదాంత, బజాజ్‌ ఆటో, హీరోమోటోకార్ప్‌, మారుతీ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలోని అన్ని విభాగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఆటో రంగం షేర్లు 3శాతం, మెటల్‌ ఇండెక్స్‌ రంగం షేర్లు 2శాతం నష్టాలను నమోదు చేశాయి. […]

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు!
Follow us on

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 196 పాయింట్లు నష్టపోయి 37,686 వద్ద, నిఫ్టీ 95పాయింట్లు నష్టపోయి 11,189 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటామోటార్స్‌, వేదాంత, బజాజ్‌ ఆటో, హీరోమోటోకార్ప్‌, మారుతీ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలోని అన్ని విభాగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఆటో రంగం షేర్లు 3శాతం, మెటల్‌ ఇండెక్స్‌ రంగం షేర్లు 2శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 5శాతం నష్టపోయి రూ.435 మార్కును తాకాయి. బ్యాంక్‌ జూన్‌ త్రైమాసానికి రూ.1,908కోట్ల మేరకు లాభాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే సీజన్లో రూ.120 కోట్లు నికర నష్టాన్నిచవిచూసింది . ఆటో రంగ షేర్లు అత్యధికంగా నష్టాల్లో ఉండటంతో ఆ రంగానికి చెందిన సూచీ 52వారాల కనిష్టాన్ని తాకింది. వాహనాలకు డిమాండ్‌ తగ్గడం, రెగ్యూలేటరీ ఒడిదొడుకుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.