భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఓవైపు జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం.. మరోవైపు చమురు ధరలు పెరగడం.. దీనికి తోడు ఆటోరంగం డీలా పడటం..  నిన్న నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. నేడు కూడా అదే బాట పట్టాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై మధ్యాహ్నం అయ్యే కొద్దీ భారీ నష్టాల్లోకి జారిపోయాయి. నేటి సెషన్లో సెన్సెక్స్‌ ఏకంగా 642 పాయింట్లు దిగజారి 36,481 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. […]

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

Updated on: Sep 17, 2019 | 4:32 PM

దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఓవైపు జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం.. మరోవైపు చమురు ధరలు పెరగడం.. దీనికి తోడు ఆటోరంగం డీలా పడటం..  నిన్న నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. నేడు కూడా అదే బాట పట్టాయి. ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలై మధ్యాహ్నం అయ్యే కొద్దీ భారీ నష్టాల్లోకి జారిపోయాయి. నేటి సెషన్లో సెన్సెక్స్‌ ఏకంగా 642 పాయింట్లు దిగజారి 36,481 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.86గా కొనసాగుతోంది. ఆటో, బ్యాంకింగ్‌, లోహ, మౌలిక, ఐటీ, ఫార్మా ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే సాగాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us