Maruti Suzuki YY8: మారుతీ కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. మారుతి ఒక చిన్న ఎలక్ట్రిక్ SUV కోసం పని చేస్తోంది. ఈ కారు కోడ్‌నేమ్ మారుతి సుజుకి YY8గా పెట్టినట్లు తెతుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల మేరకు, దీని ధర రూ. 10 లక్షల లోపు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది పరిధి 200 నుంచి 300 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. గత సంవత్సరం, టాటా పంచ్ చిన్న SUV విభాగంలో పరిచయం చేసింది. కంపెనీ దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తోందని అనేక లీక్స్ నివేదికలు వెల్లడించాయి.
ఆటో బ్లాగ్స్ వెబ్‌సైట్ ప్రకారం, మారుతి బ్రాండ్‌కు చెందిన ఈ కారు జీరో ఉద్గారంలో పని చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీని కోడ్‌నేమ్ YY8గా పెట్టినట్లు తెలుస్తోంది. దీని బాడీ SUV తరహాలో ఉంటుంది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అతిపెద్ద పోటీని ఇవ్వగలదని అంటున్నారు.
టాటా మోటార్స్ ఇప్పటికే అనేక తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఇందులో Tata Tigor EV, టాటా నెక్సాన్ EV పరిచయం చేసింది. ఇది భారతీయులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. టాటా ఈ సంవత్సరంలో టాటా టియాగో EV, టాటా పంచ్ EV, టాటా ఆల్ట్రోజ్ EVలను పరిచయం చేయవచ్చని తెలుస్తోంది.
మారుతి సుజుకి YY8 ఎలా ఉండనుందంటే..
ఇది తైవాన్‌లో ఉన్న టయోటా BEV లాగా కనిపిస్తుంది. మారుతీకి చెందిన ఈ కారు 5 సీట్లతో రానుంది. అయితే, ఈ కార్ల ఉత్పత్తి గుజరాత్‌లోని ప్లాంట్‌లో జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ప్రతి సంవత్సరం 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిని 2024 నాటికి పరిచయం చేయవచ్చని అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
Also Read: LIC Credit Card: ఎల్ఐసీ పాలసీ దారులకు ఉచితంగా క్రెడిట్ కార్డులు.. అదిరిపోయే ప్రయోజనాలు..
BSNL Plan: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలకు గట్టి పోటీ ఇస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ రూ.199 ప్లాన్..!