Telugu News Business March Bank Holidays 2026: Check Full List Of Dates Before You Plan
Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
March Bank Holidays: ఫిబ్రవరి నెలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇది ఫిబ్రవరి చివరి వారం. మార్చి నెల వచ్చే నెల, మీరు ఈ నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మార్చిలో బ్యాంకు సెలవులను ముందుగానే తనిఖీ..
March Bank Holidays: ఫిబ్రవరి నెలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇది ఫిబ్రవరి చివరి వారం. మార్చి నెల వచ్చే నెల, మీరు ఈ నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మార్చిలో బ్యాంకు సెలవులను ముందుగానే తనిఖీ చేయాలి. అయితే ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. మరి వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.. ఈ నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
మార్చి 1 – ఆదివారం సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి.
మార్చి 2 – హోలికా దహన్ కారణంగా కాన్పూర్, లక్నోలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 3- హోలీ రెండో రోజు అలాగే బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, రాంచీ, విజయవాడలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 4- అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇంఫాల్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 8 – ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 13- చాప్చర్ కుట్ కారణంగా ఈ రోజుఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
మార్చి 14న నెలలో రెండవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
మార్చి 15 – ఆదివారం సెలవు దినం. దీని కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 17 – షబ్-ఎ-ఖాదర్ కారణంగా జమ్మూ అండ్ శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
మార్చి 19- గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినం. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్, విజయవాడలో బ్యాంకులు బంద్.
మార్చి 20 -ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)/జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు.
మార్చి 21 – రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1)/ఖుతుబ్-ఎ-రంజాన్/సర్హుల్ కారణంగా కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు.
మార్చి 22 – ఆదివారం సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మార్చి 26 -శ్రీరామ నవమి. ఈ కారణంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, చండీగఢ్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాంచీ, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు.
మార్చి 27 – శ్రీరామ నవమి (చైతి దాసైన్) సందర్భంగా భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, పాట్నా, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు.
మార్చి 28 – నెలలో నాల్గవ శనివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 29- ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్.
మార్చి 31- మహావీర్ జన్మకల్యాణక్/మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులు పూర్తిగా మూసి ఉంటాయి.