Income Tax: సమయం లేదు మిత్రమా! డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. త్వరపడండి.. లేకుంటే భారీ పెనాల్టీ తప్పదు..

పన్ను చెల్లింపు దారులకు అలర్ట్! అడ్వాన్స్ ట్యాక్స్(ముందస్తు పన్ను) చెల్లించడానికి గడువు రేపటి(మార్చి 15)తో ముగుస్తోంది. ఇప్పటికీ చెల్లించి ఉంటే ఓకే. ఇంకాచెల్లించకపోతే వెంటనే కదలండి. లేదంటే పెనాల్టీ పడే అవకాశం ఉంది.

Income Tax: సమయం లేదు మిత్రమా! డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. త్వరపడండి.. లేకుంటే భారీ పెనాల్టీ తప్పదు..
Tax

Updated on: Mar 13, 2023 | 1:00 PM

పన్ను చెల్లింపు దారులకు అలర్ట్! అడ్వాన్స్ ట్యాక్స్(ముందస్తు పన్ను) చెల్లించడానికి గడువు మార్చి 15తో ముగుస్తోంది. ఇప్పటికీ చెల్లించి ఉంటే ఓకే. ఇంకాచెల్లించకపోతే వెంటనే కదలండి. లేదంటే పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఇంతకీ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసా? అది ఎవరు కట్టాలో అవగాహన ఉందా? ఒకవేళ కట్టలేక పోతే ఎంత పెనాల్టీ పడుతుందో తెలుసా? రండి తెలుసుకుందాం..

అడ్వాన్స్ పన్ను అంటే ఏమిటి?

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పరిమితికి మించిన ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లిస్తుంటారు. ఐటీఆర్ దాఖలు చేస్తుంటారు. మారి ఈ అడ్వాన్స్ ట్యాక్ ఏమిటి? ఏమి లేదు.. మీరు వచ్చిన ఆదాయానికి పన్ను చెల్లిస్తుంటారు. అలా కాకుండా రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి ముందస్తుగా పన్ను చెల్లించడాన్నే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఈ అడ్వాన్స్ పన్నును ఒకేసారి సంవత్సరం ఆఖరున కాకుండా దశల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎవరు చెల్లించాలి..

అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ పన్ను రూ. 10వేలు అంత కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ ముందస్తు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ ముందస్తు పన్ను చెల్లించాలి . సాధారణంగా కొన్ని ఆదాయాలు పన్ను(టీడీఎస్) తగ్గింపుతో వస్తాయి. అయితే అన్ని ఆదాయాలు టీడీఎస్ కు లోబడి ఉండవు. అటువంటప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులకు వారు పనిచేస్తున్న సంస్థ పన్ను మినహాయించుకుంటుంది. అందుకని వారు ప్రత్యేకంగా ఈ ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంటి అద్దె లేదా ఇతర మార్గాల నుంచి ఆదాయం వస్తుంటే అటువంటి ఆదాయంపై అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆలస్యంగా చెల్లిస్తే..

ముందస్తు పన్ను చెల్లించడంలో ఆలస్యం చేస్తే పెనాల్టీ పడుతుంది. చెల్లించాల్సిన మొత్తంపై నెలకు ఒకశాతం వడ్డీ వేస్తారు. ఒకసారి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైతే తర్వాతి వాయిదాకు మూడు నెలల సమయం ఉంటుంది. కాబట్టి మూడు నెలలకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎక్కడ చెల్లించాలి..

ముందస్తు పన్ను చెల్లింపు దారులు ఆన్ లైన్ దీనిని చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టం 1961 సెక్షన్ 44ఏబీ ప్రకారం ఈ పేమెంట్ అనే తప్పనిసరి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..