Ferrari Car: డెలివరీ అయిన గంటకే అగ్నికి ఆహుతైన ఫెర్రారీ కారు.. రూ.2.5 కోట్లు హాంఫట్..!

ప్రపంచంలో ప్రీమియం కార్లను కొనుగోలు చేసే వారిని ఫెర్రారీ కార్లు అంటే ప్రత్యేక క్రేజ్. ప్రీమియం ఫీచర్స్‌తో పాటు లుక్స్‌పరంగా ఈ కార్లు అందరినీ ఆకర్షిస్తాయి. అయితే కోట్లు పెట్టి కొన్న కారు గంటకే అగ్నికి ఆహుతైంది. టోక్యోలో జరిగిన ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ferrari Car: డెలివరీ అయిన గంటకే అగ్నికి ఆహుతైన ఫెర్రారీ కారు.. రూ.2.5 కోట్లు హాంఫట్..!
Ferrari

Updated on: Apr 27, 2025 | 4:30 PM

ఫెర్రారీ కారు కొనాలనే ఒక వ్యక్తి జీవితకాల కల డెలివరీ అయిన గంటకే మంటల్లో చిక్కుకుంది. టోక్యోకు చెందిన 33 ఏళ్ల సంగీత నిర్మాత హోంకాన్ దాదాపు రూ.2.5 కోట్ల విలువైన ఫెరారీ 458 స్పైడర్‌ను కొనుగోలు చేయడానికి పదేళ్లుగా ఎదురు చూస్తున్నాడు ఎట్టకేలకు ఏప్రిల్ 16న ఆయన ఆ లగ్జీరీ కారు కొనుగోలు చేశాడు. కొన్న వెంటనే కానీ టోక్యోలోని షుటో ఎక్స్‌ప్రెస్‌వేపై దానిని నడుపుతుండగా విషాదం నెలకొంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 

అదృష్టవశాత్తూ హోంకాన్ మంటలను గమనించి కారును ఆపివేసి, సురక్షితంగా బయటపడ్డాడు. సంఘటనకు ముందు ఎలాంటి హెచ్చరిక రాలేదని హోంకాన్ చెబుతున్నారు 20 నిమిషాల్లోనే మంటలు ఆరిపోయాయి. కానీ అప్పటికి కారులో ఎక్కువ భాగం బూడిదైంది. ముందు బంపర్‌లో ఒక చిన్న భాగం మాత్రమే చెక్కుచెదరకుండా ఉందని తెలిపాడు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ద్వారా హోంకాన్ తన బాధను వ్యక్తం చేశాడు. “డెలివరీ చేసిన గంట తర్వాత నా ఫెర్రారీ కాలిపోయింది. జపాన్ మొత్తంలో ఇలాంటి ఇబ్బందిని అనుభవించిన ఏకైక వ్యక్తి నేనేనని నేను పందెం వేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. నిజంగా ఆ సమయంలో కారు పేలిపోతుందని భయపడినట్లు చెప్పాడు. సోషల్ మీడియాలో హోంకాన్ పోస్ట్ చేసిన విషయాన్ని వినియోగదారులు షాక్ అయ్యామయంటూ పోస్ట్ చేశారు. అలాగే హోంకాన్‌కు సానుభూతి తెలిపారు. మరికొందరై భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగితే అందరూ కలిసి ఇంటికి వెళ్లాలంటూ చమత్కరిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి