Mahindra Thar SUV: కేదార్‌నాథ్‌లో మహీంద్రా థార్‌ సేవలు.. కొండల్లోనూ యాత్రికుల కోసం..

ఇది అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌ స్టైల్‌ ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యంగా అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ప్రయాణించే వారు ఇష్టపడే వాహనాల్లో ఇది ఫస్ట్‌ ఆప్షన్‌గా మారింది. ఇప్పుడు దీనిని ఏకంగా ఇండియన్‌ నేవీ అధికారులే ఇష్టపడుతుండటం సంచలనంగా మారింది. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులను రవాణా చేయడంలో సహాయపడటానికి ఈ థార్‌ ఎస్‌యూవీని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.

Mahindra Thar SUV: కేదార్‌నాథ్‌లో మహీంద్రా థార్‌ సేవలు.. కొండల్లోనూ యాత్రికుల కోసం..
Mahindra Thar

Updated on: Jun 03, 2024 | 7:21 AM

మహీంద్రా కంపెనీ కార్లకు మన దేశంలో మంచి పేరుంది. ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ డిజైన్లో ఉండే ఈ కార్ల బిల్డ్‌ క్వాలిటీ, స్పేషియస్ ఇంటిరియర్‌ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది. కాగా కొంతకాలం క్రితం భారతీయ మార్కెట్లోకి విడుదలైన థార్‌ మరింత ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా అననుకూల ప్రదేశాల్లో అంటే రహదారులు సరిగ్గా ప్రాంతాల్లో కూడా ఈ కారు బాగా ప్రయాణించగలుగుతుందని కస్టమర్‌ రివ్యూలు చెబుతున్నాయి. దీంతో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌ స్టైల్‌ ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యంగా అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ప్రయాణించే వారు ఇష్టపడే వాహనాల్లో ఇది ఫస్ట్‌ ఆప్షన్‌గా మారింది. ఇప్పుడు దీనిని ఏకంగా ఇండియన్‌ నేవీ అధికారులే ఇష్టపడుతుండటం సంచలనంగా మారింది. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులను రవాణా చేయడంలో సహాయపడటానికి ఈ థార్‌ ఎస్‌యూవీని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా రుద్రప్రయాగకు తీసుకొచ్చారు. ఇది కేదార్నాథ్ ఆలయ బేస్ క్యాంపు వద్ద హెలిప్యాడ్‌తో కూడిన ప్రదేశం.

యాత్రికుల కోసం..

ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించే యాత్రికుల రవాణాకు మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ ఉపయోగపడుతుంది. ఈ తీర్ధయాత్ర సమయంలో, సందర్శకులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే, అనారోగ్యానికి గురైన వారితో పాటు వృద్ధ యాత్రికులను రవాణా చేయడానికి ఎస్‌యూవీని వినియోగించుకుంటున్నారు. నివేదికల ప్రకారం రెండు కార్లు ఈ సేవల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారు, వృద్ధులు, వికలాంగ యాత్రికుల కోసం ఈ ఎస్‌యూవీని వినియోగిస్తున్నారు.

మహీంద్రా థార్‌ ప్రత్యేకతలు ఇవి..

మహీంద్రా థార్ భారత మార్కెట్లో మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ణా వంటి వాటితో పోటీపడుతుంది. దీ ప్రారంభ ధర రూ. 11.35 లక్షల (ఎక్స్-షోరూమ్)నుంచి ప్రారంభమవుతుండగా.. అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 17.6 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కేదార్ నాథ్‌ వద్ద సేవలు అందిస్తున్న ఎస్‌యూవీ నలుపు రంగులో ఉండగా.. ఇంకా రెడ్ రేజ్, డీప్ గ్రే, డెసర్ట్ ఫ్యూరీ మరియు ఎవరెస్ట్ వైట్ రంగులలో కూడా ఈ కారు అందుబాటులో ఉంది. ఎస్‌యూవీ లోపలి భాగంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, సర్దుబాటు చేయగల సీట్ ఎత్తు, 6- స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

భద్రతకు అధిక ప్రాధాన్యం..

ఈ ఎస్‌యూవీలోని భద్రతా అంశాలను పరిశీలస్తే.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగ్స్‌, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్‌ చైల్డ్ సీట్ మౌంట్ల వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. మహీంద్రా థార్ 2 డీజిల్, 1 పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది, అవి 2.2-లీటర్ డీజిల్, 1.5 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయి. ట్రాన్స్ మిషన్ ఎంపికల విషయానికొస్తే, ఇది 6- స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..