LPG Gas Portability: గ్యాస్ ఏజెన్సీ సర్వీస్ నచ్చలేదా? ఆన్‌లైన్‌లో సులభంగా మార్చేయండి..!

LPG Gas Portability: మీ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ/డిస్ట్రిబ్యూటర్‌ సర్వీసు నచ్చడం లేదా? అలాంటి సమయంలో దీని కోసం మీరు గ్యాస్‌ ఏజన్సీ కార్యాలయం చుట్టూ తిరిగాల్సిన అవసరమే లేదు. మీరు ఇంట్లోనే కూర్చుండి సింపుల్‌గా ఆన్‌లైన్‌లో మార్చుకోండి. అలాగే మీ గ్యాస్..

LPG Gas Portability: గ్యాస్ ఏజెన్సీ సర్వీస్ నచ్చలేదా? ఆన్‌లైన్‌లో సులభంగా మార్చేయండి..!
Lpg Gas

Updated on: May 16, 2026 | 5:05 PM

LPG Gas Portability: మీరు ప్రస్తుతం వాడుతున్న ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ నచ్చకపోయినా, లేదా ఏదైనా సమస్య ఎదురైనా ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా మీ గ్యాస్ ఏజెన్సీని మార్చుకోవచ్చు. దీనిని ‘డిస్ట్రిబ్యూటర్ పోర్టబిలిటీ’ (Distributor Portability) అంటారు. దీనిని ఎవరెవరు మార్చుకోవచ్చో తెలుసా..? ఇండేన్ (Indane), భారత్ గ్యాస్ (Bharat Gas), హెచ్‌పీ గ్యాస్ (HP Gas) వినియోగదారులు ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

మార్చుకునే విధానం:

ముందుగా మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కస్టమర్ ఐడీ (Customer ID) ఉపయోగించి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మెనూలో మీకు కనిపిస్తున్న ‘Distributor Portability’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు మీ ఇంటికి సమీపంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల/డిస్ట్రిబ్యూటర్ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి, మీకు నచ్చిన కొత్త డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోండి. అలాగే కొత్త డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP (One-Time Password) వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

ఇది కూడా చదవండి: Gold Price: గుడ్‌న్యూస్‌.. భారీ పతనం.. తులంపై రూ.5 వేలు తగ్గిన బంగారం ధర..!

ఇవి కూడా చదవండి

మీ పోర్టబిలిటీ అభ్యర్థన విజయవంతంగా నమోదవుతుంది. ఇక తదుపరి ప్రక్రియ విషయానికొస్తే.. మీరు అభ్యర్థనను సమర్పించిన కొన్ని రోజుల్లోనే మీ గ్యాస్ కనెక్షన్ కొత్త డిస్ట్రిబ్యూటర్‌కు మారిపోతుంది. ఈ ప్రక్రియలో మీ కస్టమర్ నంబర్ కానీ, మీకు వచ్చే గ్యాస్ సబ్సిడీ (Subsidy) కానీ ఎలాంటి మార్పుకు లోనవ్వవు. అవి అలాగే ఉంటాయి.

ఇది కూడా చదవండి: Tiger Facts: పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మాటల్లో షాకింగ్‌ నిజాలు

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు – గ్యాస్ సరఫరాపై ప్రభావం:

పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లో ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం దేశీయంగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని 25 శాతం పెంచాలని ఆదేశించింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతుల్లో దాదాపు 90 శాతం గ్యాస్ ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) సముద్ర మార్గం గుండానే భారతదేశానికి చేరుకుంటుంది. ఇరాన్ వివాదం కారణంగా ఈ సముద్ర మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండటంతో, దేశంలో గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: Electric Scooters: ఆకట్టుకునే రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

ఇది కూడా చదవండి: Indian Railways: వామ్మో ఇక్కడ ఇంత జరుగుతుందా..? టికెట్లు లేకుండా రైలు ప్రయాణం.. రూ.16 కోట్లకుపైగా జరిమానాలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us