
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ఊరట కలిగించాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన ఈకేవైసీ గుడువును ఆగస్ట్ 23వ తేదీ వరకు పొడిగించాయి. మరో వారం రోజుల పాటు సమయం ఇవ్వడంతో చేసుకోనివారికి మరిన్ని రోజులు అవకాశం ఉంది. గ్యాస్ కేవైసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు నిలిచిపోతాయి. మళ్లీ మీరు కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాతనే డబ్బులు అకౌంట్లో పడతాయి. గ్యాస్ సరఫరాలో పారదర్శకత, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకుని నిజమైన వినియోగదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. ఇది పూర్తి చేసేందుకు మీరు డీలర్ షిప్ కార్యాలయాల వద్ద గంటల కొద్ది వెయిట్ చేయాల్సిన పని లేదు. మీ మొబైల్‌లోనే సులువుగా కంప్లీట్ చేయవచ్చు. మీరు ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్.. ఇలా ఏ కంపెనీ వినియోగదారులైనా మొబైల్‌లోనే ఈజీగా చేసుకోవచ్చు. అదెలా అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.
-ముందుగా మొబైల్‌లో ఇండియన్ ఆయిల్ వన్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోండి
-ఇండియన్ ఆయిల్ వన్ యాప్ తెరవండి
-మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్ వర్డ్‌తో సైన్ అప్ అవ్వండి
-అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వండి
-యాప్‌లోకి వెళ్లాక లింక్ మై ఎల్‌పీజీ ఐడీపై క్లిక్ చేయండి
-16 అంకెల ఎల్పీజీ ఐడీ నమోదు చేయండి
-అనంతరం మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లండి
-ఇండేన్ డీటైల్స్ ఆప్షన్ ఎంచుకోండి
-రీకేవైసీపై క్లిక్ చేయండి
-అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేసి ప్రాసెస్ చేయండి
-ఫేస్ స్కాన్ చేసి బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి
-హెచ్‌పీ పే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
-యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-హోమ్ పేజీలో ఎల్పీజీ ఆప్షన్ ఎంచుకుని ఈకేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-క్యాప్చర్ ఫేస్ ఆప్షన్ ఎంచుకోండి
-ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది.
-భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి
-అనంతరం మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోండి