Lifestyle: రూ.35 వేల కోట్లకుపైగా ఆస్తులు.. భార్యా పిల్లలతో నార్మల్ లైఫ్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!

John Caudwell: కాడ్‌వెల్ తన పిల్లల దుస్తుల విషయంలో కూడా సాదాసీదా విధానాన్నే పాటిస్తారు. ఖరీదైన డిజైనర్ బ్రాండ్లకు బదులుగా Zara, Primark వంటి స్టోర్ల నుంచి దుస్తులు కొనుగోలు చేస్తారు. “వేల పౌండ్లు ఖర్చు చేసి దుస్తులు కొంటే పిల్లలు ఎక్కువ..

Lifestyle: రూ.35 వేల కోట్లకుపైగా ఆస్తులు.. భార్యా పిల్లలతో నార్మల్ లైఫ్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!
John Caudwell

Updated on: Mar 23, 2026 | 8:15 AM

Lifestyle: ఈ రోజుల్లో డబ్బున్న వాళ్లు కుటుంబంతో సహా ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే లగ్జరీని ఎంచుకుంటారు. బస్సులు, కార్లలో కార్లలో కాకుండా విమానాల్లో ప్రయాణం చేస్తుంటారు. అది కూడా సాధారణం ప్రయాణం కాకుండా మంచి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తుంటారు. బ్రిటిష్‌ వ్యాపారవేత్త జాన్ కాడ్‌వెల్‌ (John Caudwell) ప్రపంచంలోని ప్రముఖ ధనవంతుల్లో ఒకరు. Forbes అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తి సుమారు 4.2 బిలియన్ డాలర్లు. మొబైల్ ఫోన్ రిటైల్ రంగంలో Phones 4u మరియు Singlepoint సంస్థలను స్థాపించి విక్రయించిన ఆయన, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. అయితే అంతటి సంపద ఉన్నప్పటికీ, కుటుంబ జీవన విధానంలో ఆయన ఎంతో సాధారణతను పాటించడం ప్రత్యేకం.

ఎనిమిది మంది పిల్లలు.. సాధారణ పెంపకం:

జాన్ కాడ్‌వెల్‌కు మొత్తం ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు స్టెప్‌చైల్డ్‌. వీరి వయసులు 2 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల వరకు విస్తరించి ఉన్నాయి. తన చిన్ననాటి జీవితం ఎంతో కష్టాల్లో గడిచిందని ఆయన గుర్తుచేసుకుంటారు. “నాకు చిన్నప్పుడు దాదాపు ఏమీ ఉండేది కాదు. నా పిల్లలకు కూడా అలానే ఉండకూడదు, కానీ అధికంగా లాలన చేయడం కూడా సరికాదు” అంటే సాధారణ జీవితం నుంచి పైకి ఎగదాలి తప్ప లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడేలా ఇప్పటి నుంచే చేయకూడదనేది తన అభిప్రాయమని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

ఇవి కూడా చదవండి

బిలియనీర్ జీవితం అంటే విలాసం అనుకుంటాం. కానీ కాడ్‌వెల్ కుటుంబం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇంట్లో కేవలం ఇద్దరు హౌస్‌కీపర్లు మాత్రమే ఉంటారు. పిల్లలకు క్రమశిక్షణ, విద్య, వినోదం లాంటి స్కూలే ముఖ్యంగా భావిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు స్కూల్‌లో గడపడం వాళ్ల అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం.

ప్రయాణాల్లో కూడా సాధారణత:

పిల్లలకు విలాసవంతమైన జీవితం చూపించకుండా, సాధారణ జీవన విధానాన్ని నేర్పించడమే ఆయన లక్ష్యం. కుటుంబం ట్రిప్‌కి వెళ్లినా, ఎక్కువగా పిల్లలు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. ఆయన మాత్రం కొన్నిసార్లు బిజినెస్ క్లాస్‌లో వెళ్తారు. సూపర్‌యాట్‌లో సెలవులు గడిపేటప్పుడు కూడా అది ప్రధానంగా తనకోసం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. పెద్ద పిల్లలు తమ ప్రయాణ ఖర్చులను తామే భరించుకోవాలి. కుటుంబం తరచూ బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌ను ఉపయోగించడం ద్వారా “సాధారణ జీవితం ఎలా ఉంటుందో” పిల్లలకు చూపిస్తారు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయాణానికి గల కారణాలను వివరిస్తున్నారు. తన పిల్లలకు డబ్బు విలువ తెలియాలనే ఉద్దేశంతో, లైఫ్‌లో విలాసాలు అనుభవించాలంటే కష్టపడితేనే సాధ్యమని తెలిసేలా ఇలా చేస్తున్నట్లు చెబుతున్నాడు. అయితే చిన్న వయస్సులోనే ఇలా అన్ని రకాల సౌకర్యాలను అందించినట్లయితే కష్టం విలువ తెలియని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ. 4 లక్షల పరిహారం.. కమిషన్ సంచలన నిర్ణయం

ఖరీదైన దుస్తులకు నో..

కాడ్‌వెల్ తన పిల్లల దుస్తుల విషయంలో కూడా సాదాసీదా విధానాన్నే పాటిస్తారు. ఖరీదైన డిజైనర్ బ్రాండ్లకు బదులుగా Zara, Primark వంటి స్టోర్ల నుంచి దుస్తులు కొనుగోలు చేస్తారు. “వేల పౌండ్లు ఖర్చు చేసి దుస్తులు కొంటే పిల్లలు ఎక్కువ సంతోషపడరు. కానీ అలాంటి అలవాటు వాళ్లను ఎక్కువగా అలసత్వానికి గురిచేస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత ధనవంతుడైనప్పటికీ, జాన్ కాడ్‌వెల్ తన పిల్లలను సాధారణ జీవిత విలువలను అర్థం చేసుకునేలా పెంచుతున్నారు. క్రమశిక్షణ, స్వతంత్రత, విలువైన జీవన విధానమే నిజమైన సంపద అని ఆయన నమ్మకం.

ఇది కూడా చదవండి: LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

వీరి జీవితంపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. పిల్లలకు క్రమశిక్షణ, డబ్బు విలువ నేర్పడానికి ఇది మంచి పద్ధతి అని అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. “కోట్ల ఆస్తి పెట్టుకుని భార్యాపిల్లలను ఇబ్బంది పెట్టడం సరికాదని”, “ఇది క్రమశిక్షణ కాదు, పిసినారితనం” అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా భార్యను కూడా ఎకానమీలో పంపడంపై మహిళా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సంపన్నుల పెంపకం, విలువల గురించి కొత్త చర్చకు దారితీసింది

విపరీతమైన ఖర్చులకు దూరంగానే..

తాను తన పిల్లల కోసం విపరీతమైన ఖర్చులకు దూరంగా ఉంటానని కాడ్వెల్ వెల్లడించారు. వారు అరుదుగా ప్రైవేట్ విమానాల్లో ప్రయాణిస్తారు. తాను తన కోసం బిజినెస్ క్లాస్ బుక్ చేసినప్పటికీ, భార్య, పిల్లలు మాత్రం తరచుగా ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us