
కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్ధ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక పాలసీలను ప్రవేశపెడుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరికీ అందుబాటులో ఉండేలా అనేక ఆకర్షణీయమైన స్కీమ్స్ తీసుకొస్తోంది. ప్రతీ నెలా చిన్న మొత్తంలో జమ చేయడం ద్వారా మంచి ఆదాయం, ఆర్ధిక భద్రత పొందవచ్చు. ఎల్ఐసీలో అత్యంత ప్రజాదరణ పాలసీలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి జీవన్ ఆనంద్ పాలసీ. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందాలనుకునేవారికి ఇది బెస్ట్ పథకంగా చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్‌తో పాటు అనేక బహుళ ప్రయోజనాలు ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. రోజుకు రూ.45 ఆదా చేసుకోవడం ద్వారా రూ.25 లక్షలు పొందే అవకాశం ఇందులో ఉంది. అదెలా అనేది చూద్దాం.
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కాలపరిమితి 15, 35 సంవత్సరాలు ఉంటుంది. మీరు 35 సంవత్సరాటు పాటు రోజుకు రూ.45 పెట్టుబడి పెట్టారనుకుందాం. అంటే నెలకు రూ. 1358 అవుతుంది. అదే సంవత్సరానికి రూ.16,300 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు 35 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలు అందుతాయి. 35 ఏళ్లల్లో మీరు మొత్తం రూ.5,70,500 ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో రివిజరీ బోనస్, ఫైనల్ బోనస్ మొత్తం అందుతుంది. రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్ అందే అవకాశముండగా.. రూ.11.50 లక్షల ఫైనల్ బోస్ అందుతుంది. జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు ఇస్తారు. పాలసీ కాలపరిమితి 15 ఏళ్లు ఉండాలి. ఇక ఈ పాలసీలో నాలుగు రైడర్లు ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్యూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ రైడర్ ఉంటాయి. పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీపై 125 శాతం మరణ ప్రయోజనం లభిస్తుంది. ఇది కుటుంబానికి భద్రతను కల్పిస్తుంది.
ఈ ప్లాన్‌లో కనీస హామీ మొత్తం రూ.లక్షగా ఉండగా.. గరిష్ట పరిమితి లేదు. దీంతో ఎంత అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీలో అనేక బెనిఫిట్స్ ఉండటంతో ఎక్కువగా దీనిని తీసుకుంటూ ఉంటారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ చెందిన పాలసీగా ఇది కొనసాగుతోంది. ఎల్ఐసీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బీమా సంస్థ కావడంతో క్లెయిమ్ సమస్యలు ఉండవు. మెచ్యూరిటీ తర్వాత త్వరగా క్లెయిమ్ నిధులు అందుతాయి. దీంతో క్లెయిమ్ రాదనే టెన్షన్ ఉండదు.