ప్రస్తుతం ఏ చిన్న పనికైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. రైలు టికెట్ నుంచి ఫ్లైట్ టికెట్ వరకు.. సిమ్ కార్డు నుంచి ఇటీవలి కాలంలోని వ్యాక్సినేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు ఆధార్ కార్డు పక్కాగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్‌ను లింక్ చేసుకోవాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా మారిపోయింది. ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగానే పనులు జరుగుతున్నాయి.
అయితే కొత్తగా ఆధార్ తీసుకుంటున్న వారికి ఫోన్ నెంబర్లను లింక్ చేస్తున్నారు. కానీ గతంలో ఆధార్ తీసుకున్న వారికి ఫోన్ నెంబర్‌లు లింక్ చేయకుండానే కార్డులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి కీలక సమయంలో ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌కు ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందామా..! ఈ విషయమై యూఐడీఏఐ ఫోన్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో వీడియో రూపంలో ట్వీట్ చేశారు.
* ఆధార్ కార్డు కలిగి ఫోన్ నంబర్‌తో లింక్ చేయనివారు ముందుగా.. సమీపంలో ఉన్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాలి.
* మీకు దగ్గరల్లో ఉన్న ఆధార్ ఎన్‌రోల్ మెంట్ సెంటర్లను తెలుసుకోవడానికి ఎమ్ఆధార్ యాప్ లేదా.. 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
* ఆధార్ నెంబర్‌కు ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడానికి అదే సమయంలో పాత నెంబర్‌ను మార్చడానికి ఎలాంటి డ్యాక్యుమెంట్లు అవసరం ఉండవు.
* బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం అభ్యర్థి నేరుగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. కాబట్టి నేరుగా వెళ్లాల్సిందే.
* అనంతరం, ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన ఆధార్ కరెక్షన్ ఫారమ్‌ను పూరించండి. అన్ని వివరాలు ఇచ్చి కేవలం రూ. 50 ఫీజు అందిస్తే చాలు మొబైల్ నెంబర్‌ను ఆధార్ లింక్ చేసేస్తారు. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఆధార్‌కు మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవచ్చు.
* లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్‌తో నమోదు చేసుకున్న తర్వాత అనేక సౌకర్యాలను పొందడం కోసం మీరు ఆధార్ OTPలను అందుకుంటారు.
* ఆధార్ అప్‌డేట్ స్థితిని పొందడానికి మీరు UIDAI యొక్క టోల్-ఫ్రీ నంబర్ 1947కి కూడా కాల్ చేయవచ్చు.
* ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక వెబ్‌సైట్(https://uidai.gov.in/)ను సందర్శించండి.
* హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ‘నా ఆధార్’పై నొక్కండి.
* డ్రాప్-డౌన్ మెను నుంచి ఆధార్ సేవల కింద, మీ రిజిస్టర్ మొబైల్ లేదా ఇమెయిల్ ఐడీని ‘ధృవీకరించు’ మీద క్లిక్ చేయండి.
* తర్వాతి కొత్త ట్యాబ్‌లో మీరు ధృవీకరించాలనుకునే ఆధార్ నంబర్ మరియు లేదా మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDని నమోదు చేయండి.
* ఇప్పుడు క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, Send OTPపై క్లిక్ చేయండి.
* మొబైల్ నంబర్ UIDAI రికార్డులతో సరిపోలితే, మీకు ‘‘మీరు నమోదు చేసిన మొబైల్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది’’ అనే ఫ్లాష్ కనిపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..