Auto News: బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది.. భారత్‌లోనే తయారీ..!

Auto News: ఇప్పటివరకు భారత్‌లో విక్రయించే ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కార్లను పూర్తిగా విదేశాల్లో తయారుచేసి, ఇక్కడికి దిగుమతి చేసుకునేవారు. ఈ విధానాన్ని CBU (Completely Built-Up Unit) అంటారు. పూర్తిగా తయారైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల దిగుమతి సుంకాలు..

Auto News: బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది.. భారత్‌లోనే తయారీ..!
Land Rover Defender

Updated on: Oct 30, 2026 | 7:52 PM

Auto News: లగ్జరీ SUV కొనాలని భావిస్తున్న వారికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) శుభవార్త అందించింది. భారత మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 (Land Rover Defender 110) SUV ధరలను భారీగా తగ్గించింది. ఈ మోడల్ ధరలు గరిష్ఠంగా రూ.34 లక్షల వరకు తగ్గాయి. ఇంత భారీగా ధర తగ్గడానికి ప్రధాన కారణం కంపెనీ ఈ SUVని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించడమే. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న చాకన్ ప్లాంట్‌లో డిఫెండర్ 110 అసెంబ్లింగ్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో గతంలో పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ SUV ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ కానుంది.

ఎందుకు తగ్గింది డిఫెండర్ ధర?

ఇప్పటివరకు భారత్‌లో విక్రయించే ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కార్లను పూర్తిగా విదేశాల్లో తయారుచేసి, ఇక్కడికి దిగుమతి చేసుకునేవారు. ఈ విధానాన్ని CBU (Completely Built-Up Unit) అంటారు. పూర్తిగా తయారైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల దిగుమతి సుంకాలు, ఇతర ఖర్చులు ధరపై ప్రభావం చూపుతాయి. అయితే, ఇప్పుడు జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ CKD విధానాన్ని అనుసరిస్తోంది. అంటే కారుకు సంబంధించిన విడిభాగాలను విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి, పుణెలోని చాకన్ ప్లాంట్‌లో వాటిని అసెంబుల్ చేస్తారు. దీనివల్ల పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకునే విధానంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఈ ప్రయోజనాన్ని కంపెనీ వినియోగదారులకు ధర తగ్గింపు రూపంలో అందిస్తోంది.

డిఫెండర్ 110 కొత్త ధరలు ఇవే!

స్థానిక అసెంబ్లింగ్ ప్రారంభమైన తర్వాత డిఫెండర్ 110 X-Dynamic HSE వేరియంట్ల ధరల్లో గణనీయమైన మార్పు వచ్చింది.

  • 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ధర రూ.1.13 కోట్లు ఉండగా, తగ్గివన తర్వాత రూ.99 లక్షలకు చేరుకుంది.
  • 3.0 లీటర్ పెట్రోల్ ధర రూ.1.52 కోట్లు ఉండగా, తగ్గిన తర్వాత రూ.1.18 కోట్లు.
  • 3.0 లీటర్ డీజిల్ ధర రూ.1.52 కోట్లు ఉడగా, తగ్గిన తర్వాత రూ.1.18 కోట్లు

గమనిక: ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. నగరం, పన్నులు, ఇతర ఛార్జీల ఆధారంగా ఆన్-రోడ్ ధర మారుతుంది. ఈ ధరల ప్రకారం 3.0 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.34 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. 2.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.14 లక్షల వరకు తగ్గింది.

ఎప్పటి నుంచి డెలివరీలు ప్రారంభం?

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, కొత్తగా స్థానికంగా అసెంబుల్ చేసిన డిఫెండర్ 110 SUV బుకింగ్స్ ఆన్‌లైన్‌తో పాటు అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. డెలివరీలు 2026 నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, డిఫెండర్ మోడల్‌లోని అన్ని మోడళ్లకు ఈ ధర తగ్గింపు వర్తించదు. ప్రస్తుతం డిఫెండర్ 110లో ఎంపిక చేసిన X-Dynamic HSE వేరియంట్లకే స్థానిక అసెంబ్లింగ్ ప్రయోజనం లభిస్తోంది. డిఫెండర్ 90, డిఫెండర్ 130, డిఫెండర్ 110 OCTA వంటి మోడళ్లను గతంలో మాదిరిగానే పూర్తిగా దిగుమతి చేసుకుని విక్రయించనున్నారు.

ఇది కూడా చదవండి: Gas Stove: గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే.. ఈ విషయం తెలుసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us