Kinetic : కైనెటిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

|

Dec 12, 2023 | 2:35 PM

కైనెటిక్‌ గ్రీన్‌ జులు పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. కైనెటిక్‌ సంస్థకు భారత్‌లో మంచి బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. హోండాతో కలిసి.. కైనెటిక్​ హోండ్​ స్కూటర్​ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వెహికిల్‌కు మంచి క్రేజ్‌ లభించింది. అయితే తాజాగా మారుతోన్న కాలానికి అనుగుణంగా కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది. గ్రీన్‌ జులు పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో...

Kinetic : కైనెటిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Kinetic Green Zulu electric scooter
Follow us on

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు క్రేజ్‌ పెరుగుతోంది. ఆటో మొబైల్ సంస్థలు సైతం సంప్రదాయ ఇంధన వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కైనెటిక్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది.

కైనెటిక్‌ గ్రీన్‌ జులు పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. కైనెటిక్‌ సంస్థకు భారత్‌లో మంచి బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. హోండాతో కలిసి.. కైనెటిక్​ హోండ్​ స్కూటర్​ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వెహికిల్‌కు మంచి క్రేజ్‌ లభించింది. అయితే తాజాగా మారుతోన్న కాలానికి అనుగుణంగా కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది. గ్రీన్‌ జులు పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

కైనెటిక్‌ గ్రీన్‌ జులు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఏప్రన్​ మౌంటెడ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, హ్యాండిల్ ​బార్​ స్టాక్​పై డీఆర్​ఎల్​ వంటి ఫీచర్లను అందించారు. స్పోర్టీ లుక్‌లో ఉండేలా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. ఇక ఈ స్కూటర్‌ డైమెన్షన్స్ విషయానికొస్తే.. స్కూటర్​ పొడవు 1,830ఎంఎం. వెడల్పు 715ఎంఎం. ఎత్తు 1,135ఎంఎం. వీల్​బేస్​ 1,360ఎంఎం. గ్రౌండ్​ క్లియరెన్స్​ 160ఎంఎంగా ఉంది. ఇక స్కూటర్‌ కర్బ్​ వెయిట్​ 93కేజీలు. 150కేజీల వరకు బరువును మోయగలదు.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 2.27 కేడబ్ల్యూహెచ్​ లిథియం- ఐయాన్​ బ్యాటరీని అందించారు. కేవలం 30 నిమిషాల్లోనే 0-80 శాతం ఛార్జింగ్ పూర్తికావడం ఈ స్కూటర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 104 కి.మీలు దూసుకెళ్తుంది. ఇక ఈ స్కూటర్‌ గంటకు 60 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌తో వెళ్తుతుంది. డ్యూయల్ డిస్క్‌ బ్రేక్స్‌ ఇందులో అందించారు. ఇక వచ్చే ఏడాది ఈ మోడల్‌లో ఆయిల్ కూల్డ్‌ బ్యాటరీ ఆప్షన్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో స్కూటర్‌ రేంజ్‌ మరింత పెరగనుంది.

ఇక కైనెటిక్‌ గ్రీన్ జులు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర విషయానికొస్తే.. ఎక్స్‌ షోరూం ధర రూ. 95,000గా నిర్ణయించారు. వచ్చే 12 నెలల్లో కనీసం 40 వేల స్కూటీలు అమ్మడమే టార్గెట్‌గా పెట్టుకుంది కంపెనీ. కైనెటిక్‌ ఈ స్కూటీని.. ఓలా ఎస్​1 ఎక్స్​+, ఒకినవా ప్రైజ్​ప్రోతో పాటు పలు ఇతర మోడల్స్​తో పోటీగా తీసుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..